రణధీర్ కపూర్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ కరిష్మా కపూర్(Karisma Kapoor). అభిమానులందరూ ముద్దుగా ‘లోలో’ (Lolo) అని పిలుస్తుంటారు. ఆమె చిన్న వయసులోనే హీరోయిన్‌గా వెండితెర పైకి రంగప్రవేశం చేశారు. అనంతరం పలు చిత్రాల్లో నటించి అభిమానుల మెప్పు పొందారు. కరిష్మా జూన్ 25న పుట్టిన రోజు వేడుకలను జరుపుకొన్నారు. అందుకు సంబంధించిన వీడియో బిట్స్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు, సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలపడం మొదలుపెట్టారు. కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan) కూడా తన సోదరికీ పుట్టిన రోజు విషెస్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘మా కుటుంబానికి గర్వకారణం. నీ ఫొటోల్లో నా ఫేవరేట్ ఇదే. ఇప్పుడు అందరు కలసి చెప్పండి మా ‘లోలో’ కు హ్యాపీ బర్త్ డే. నువ్వే ఎప్పటికి నా బెస్ట్ సోదరివి’’ అని కరీనా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పారు.
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్‌కు ‘రాజా హిందూస్థానీ’ (Raja Hindustaani) చిత్రంతో బ్రేక్ వచ్చింది. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ హీరోగా నటించారు. 1996లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. అనంతరం ‘దిల్ తో పాగల్ హై’ (Dil To Pagal Hai), ‘జుడ్వా’(Judwaa), ‘బీవీ నం-1’(Biwi No 1)వంటి చిత్రాల్లో నటించారు. ఆమె చివరగా 2012లో విడుదలైన ‘డేంజరస్ ఇష్క్’ (Dangerous Ishhq)లో కనిపించారు. అనంతరం ‘బాంబే టాకీస్’, ‘జీరో’ మూవీస్‌ల్లో అతిథి పాత్రలో మెరిశారు. త్వరలోనే ‘బ్రౌన్’ అనే ప్రాజెక్టులో ఆమె నటించనున్నారు. ఈ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపారు.