Kareena Kapoor: జనాభా పెరుగుదలకు Saif ఇప్పటికే చాలా కృషి చేశాడు.. ప్రెగ్నెన్సీ పుకార్లపై నటి వెరైటీ కామెంట్స్

ABN , First Publish Date - 2022-07-20T19:32:06+05:30 IST

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ (Kareena Kapoor) జంట ఒకటి. వీరి మధ్య దాదాపు 13 సంవత్సరాల వయస్సులో..

Kareena Kapoor: జనాభా పెరుగుదలకు Saif ఇప్పటికే చాలా కృషి చేశాడు.. ప్రెగ్నెన్సీ పుకార్లపై నటి వెరైటీ కామెంట్స్

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), కరీనా కపూర్ (Kareena Kapoor) జంట ఒకటి. వీరి మధ్య దాదాపు 13 సంవత్సరాల వయస్సులో తేడా ఉంది. 2012లో ఈ జంట పెళ్లి చేసుకోగా.. వీరికి తైమూర్ అలీఖాన్, జహంగీర్ అలీఖాన్ అనే ఇద్దరూ కుమారులు ఉన్నారు. అయితే.. సైఫ్ ఇంతకుముందే అమృతా సింగ్ అనే యాక్టర్‌ని పెళ్లి చేసుకోగా.. సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాత కరీనాని ప్రేమ వివాహం చేసుకున్నాడు సైఫ్. ఈ కపుల్ గురించి మరో క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది.


ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న ఈ జంట మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కరీనా మూడోసారి గర్భవతైందంటూ రూమర్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ న్యూస్‌పై తాజాగా కరీనా స్పందింస్తూ ఫన్నీగా ఓ పోస్ట్ పెట్టింది. కరీనా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టోరీలో.. ‘ఇది పాస్తా, వైన్ అబ్బాయిలు... ప్రశాంతంగా ఉండండి... నేను గర్భవతిని కాదు.. ఉఫ్.. మన దేశ జనాభా పెరుగుదలకి సైఫ్ చాలా దోహదపడ్డాడు. ఎంజాయ్ చేయండి..KKK’ అని రాసుకొచ్చింది. దీంతో ఆ రూమర్స్ కేవలం గాలి వార్తలేనని తెలియిపోయింది.


కాగా.. కరీనా కపూర్, అమీర్ ఖాన్‌తో కలిసి తాజాగా ‘లాల్ సింగ్ చద్దా’లో నటించింది. టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 11, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంతేకాకుండా, ఆమె సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్టులో నటిస్తోంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యేకంగా ప్రసారం కానుంది.

Updated Date - 2022-07-20T19:32:06+05:30 IST