Kareena Kapoor: భారీ రెమ్యూనరేషన్ వదంతులపై స్పందించిన కరీనా

ABN , First Publish Date - 2022-08-03T23:13:20+05:30 IST

చిన్న తనంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ కరీనా కపూర్ (Kareena Kapoor). ‘జబ్ వి మెట్’, ‘త్రీ ఇడియట్స్’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.

Kareena Kapoor: భారీ రెమ్యూనరేషన్ వదంతులపై స్పందించిన కరీనా

చిన్న తనంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ కరీనా కపూర్ (Kareena Kapoor). ‘జబ్ వి మెట్’, ‘త్రీ ఇడియట్స్’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ‘లాల్ సింగ్ చడ్డా’ లో హీరోయన్‌గా నటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కరీనా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. తాను భారీగా రెమ్యూనరేషన్‌ను పెంచేశాననే వదంతులపై స్పందించింది. 


‘రామాయణ’ (Ramayana) వెబ్ సిరీస్‌లో సీత పాత్ర కోసం మేకర్స్ కరీనాను సంప్రదించారని.. ఆ పాత్ర కోసం రూ. 12కోట్లను ఆమె డిమాండ్ చేసిందని పుకార్లు షికార్లు కొట్టాయి. ఈ వార్తలకు కరీనా రిప్లై ఇచ్చింది. ‘‘ఆ సినిమా ఆఫర్ నాకు రాలేదు. నేను రెమ్యూనరేషన్‌ను పెంచేశాననే వార్తలు ఏలా వచ్చాయో నాకు తెలీదు. అవన్ని పుకార్లు మాత్రమే. ప్రజలు మాట్లాడుకోవడానికి ప్రతిరోజు ఏదో ఒకటి కావాలి. ఈ వార్తలు ఎక్కడి నుండి వచ్చాయో. నేడు 100 సమాచార సాధనాలు ఉన్నాయి. ప్రతిరోజు వాటిలో అనేకం వస్తుంటాయి. నేను వాటిని పట్టించుకోను. నా పని నేను చేస్తాను లేదా నా అభిప్రాయాన్ని ట్వీట్స్ రూపంలో వెల్లడిస్తుంటా’’ అని కరీనా కపూర్ చెప్పింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. కరీనా కపూర్ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చడ్డా’ లో నటించింది. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ హీరోగా నటించాడు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. అమెరికన్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో అక్కినేని నాగచైతన్య, మోనా సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2022-08-03T23:13:20+05:30 IST