Kareena Kapoor and Karisma Kapoor: స్టెలిష్ లుక్‌తో హృదయాలను కొల్లగొడుతున్న బాలీవుడ్ సిస్టర్స్

ABN , First Publish Date - 2022-09-07T17:11:15+05:30 IST

బాలీవుడ్‌లో స్టార్‌డమ్, ఫ్యాన్ బేస్ ఉన్న సోదరీమణులు కరీనా కపూర్ (Kareena Kapoor), కరిష్మా కపూర్ (Karisma Kapoor)...

Kareena Kapoor and Karisma Kapoor: స్టెలిష్ లుక్‌తో హృదయాలను కొల్లగొడుతున్న బాలీవుడ్ సిస్టర్స్

బాలీవుడ్‌లో స్టార్‌డమ్, ఫ్యాన్ బేస్ ఉన్న సోదరీమణులు కరీనా కపూర్ (Kareena Kapoor), కరిష్మా కపూర్ (Karisma Kapoor). ఈ సోదరిమణులను బీ టౌన్ ప్రేక్షకులు స్టైలిష్ సిస్టర్స్ (Sisters) అని పిలుచుకుంటూ ఉంటారు. అంతగా.. డ్రెస్సింగ్‌కి, స్టైలింగ్‌కి ఫ్రాధ్యానం ఇస్తారు ఈ సిస్టర్స్. క్యాజువల్ వేర్ నుంచి చీరకట్టు వరకూ అన్నింటిలోనూ చాలా అందంగా ఆకట్టుకుంటూ ఉంటారు.


తాజాగా కరీష్మా, కరీనా కలిసి ముంబైలోని బాంద్రా ఏరియాలో ఉన్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. వారితో కలిసి అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా దిగిన పలు పిక్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. క్యాజువల్ వేర్‌ని ఎంచుకున్నారు ఈ సోదరీమణులు. అందులో.. కరీనా పాస్టెల్ ఆకుపచ్చ పూల శాటిన్ షర్ట్, నీలి రంగు డెనిమ్‌ ఫ్యాంట్ వేసుకుని చాలా అందంగా కనిపించింది. కరిష్మా మోనోక్రోమ్ ఎన్‌మెంబుల్‌లో ఎప్పటిలాగే అందంగా కనిపించింది. ఈ నటి నలుపు, తెలుపు చారల కాటన్ షర్ట్‌లో చాలా సింపుల్‌గా ఉంది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ వారి డ్రెస్సింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.



Updated Date - 2022-09-07T17:11:15+05:30 IST