త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న Koffee With Karan.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ABN , First Publish Date - 2022-05-04T23:49:58+05:30 IST

బాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్ కరణ్ జోహార్(Karan Johar)బరువెక్కిన హృదయంతో ఓ కీలక ప్రకటన చేశాడు. ఆయన హోస్ట్‌గా వ్యవహరించిన సెలబ్రిటీ చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan) ముగిసిందని

త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న Koffee With Karan.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

బాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్ కరణ్ జోహార్(Karan Johar)బరువెక్కిన హృదయంతో ఓ కీలక ప్రకటన చేశాడు. ఆయన హోస్ట్‌గా వ్యవహరించిన సెలబ్రిటీ చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan) ముగిసిందని చెప్పాడు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో బుధవారం ఓ పోస్ట్ పెట్టాడు. కానీ, మార్కెటింగ్ ఎత్తుగడలో భాగంగా సోషల్ మీడియాలో అతడు ఈ పోస్ట్ పెట్టాడు. ఈ చాట్ షో ముగియలేదని త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫాం ‘డిస్నీ+హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ కాబోతుందని కరణ్ ప్రకటించాడు.


షోలో భాగంగా కరణ్ అనేక మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేశాడు. ఇప్పటికే ఈ చాట్ షో ఆరు సీజన్‌లు ప్రసారమయ్యి శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఏడో సీజన్ ప్రసారం కాబోతుందని మీడియాలో పుకార్లు షికార్లు చేయడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశాడు. ‘‘ప్రతి గొప్ప కథకు ఓ మంచి ట్విస్ట్ తప్పక ఉండాలి. ‘కాఫీ విత్ కరణ్’ తిరిగి టీవీలో ప్రసారం కాదు. ఈ చాట్ షో 7వ సీజన్ ‘డిస్నీ+హాట్ స్టార్‌’ లో ప్రసారం కానుంది. భారత్‌కు చెందిన పెద్ద తారలందరూ కాఫీ తాగుతూ ఈ షోలో పాల్గొనబోతున్నారు. వదంతులకు చెక్ పెట్టి లోతైన చర్చలను జరపడానికి ఈ షో సిద్ధంగా ఉంది’’ అని ట్విట్టర్‌లో కరణ్ పోస్ట్ పెట్టాడు. 

Updated Date - 2022-05-04T23:49:58+05:30 IST