Sara Ali Khan: బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్‌తో వరుసగా సినిమాలు

ABN , First Publish Date - 2022-08-14T01:34:18+05:30 IST

స్టార్ హీరో వారసురాలిగా ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న అందాల భామ సారా అలీ ఖాన్ (Sara Ali Khan). సుశాంత్ సింగ్ హీరోగా నటించిన ‘కేదార్ నాథ్’ (Kedarnath)తో

Sara Ali Khan: బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్‌తో వరుసగా సినిమాలు

స్టార్ హీరో వారసురాలిగా ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న అందాల భామ సారా అలీ ఖాన్ (Sara Ali Khan). సుశాంత్ సింగ్ హీరోగా నటించిన ‘కేదార్ నాథ్’ (Kedarnath)తో ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చింది. ‘సింబా’ (Simmba), ‘లవ్ అజ్ కల్’, ‘కూలీ నెం-1’, ‘అత్రాంగీ రే’ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌లో ఆమె రెండు చిత్రాలు చేయనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధినేత కరణ్ జోహారే స్వయంగా తెలిపాడు. 


ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆసక్తికర కబుర్లను అభిమానులకు వివరించాడు. సారా అలీ ఖాన్‌తో రెండు చిత్రాలు చేయనున్నట్టు తెలిపాడు. ‘‘నేను, సారా కలసి అద్భుతమైన సినిమా చేయనున్నాం. ఈ చిత్రానికి నేను నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. అమెజాన్ కోసం ఈ మూవీని నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దీనితో పాటు మా కోసం ఆమె మరో సినిమా కూడా చేస్తుంది’’ అని కరణ్ జోహార్ చెప్పాడు. సారా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు తనకు తెలియవని ఈ ఇంటర్వ్యూలోనే కరణ్ తెలిపాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. సారా అలీ ఖాన్ చివరగా ‘అత్రాంగీ రే’ (Atrangi Re) లో నటించింది. ధనుష్ హీరోగా నటించాడు. ఈ చిత్రం ‘డిస్నీ+హాట్‌స్టార్’ లో నేరుగా విడుదలైంది. ప్రస్తుతం ఆమె ఓ హీస్టా‌రికల్ సినిమా చేస్తుంది. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆధారంగా చేసుకుని ఈ మూవీని రూపొందిస్తున్నారు. విక్రాంత్ మెస్సీతో కలసి ‘గ్యాస్ లైట్’ లోను నటిస్తుంది. 

Updated Date - 2022-08-14T01:34:18+05:30 IST