Karan Johar: ఇతను వచ్చే సీజన్ లో బూతులు మాట్లాడట!

ABN , First Publish Date - 2022-10-01T19:07:19+05:30 IST

కరణ్ జోహార్ హోస్ట్ గా 'కాఫీ విత్ కరణ్' 7వ సీజన్ ఈ వారంతో అయిపోయింది. ఇది కరణ్ స్వయంగా మొన్న గురువారం నాడు సీజన్ 7 లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పేశాడు. అయితే సీజన్ 8 కూడా వుంది అని, అది కూడా త్వరలో వస్తుందని చెప్పాడు కరణ్.

Karan Johar: ఇతను వచ్చే సీజన్ లో బూతులు మాట్లాడట!

కరణ్ జోహార్ హోస్ట్ గా 'కాఫీ విత్ కరణ్' 7వ సీజన్ ఈ వారంతో అయిపోయింది. ఇది కరణ్ స్వయంగా మొన్న గురువారం నాడు సీజన్ 7 లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పేశాడు. అయితే సీజన్ 8 కూడా వుంది అని, అది కూడా త్వరలో వస్తుందని చెప్పాడు కరణ్. మొత్తం సీజన్ లో వచ్చిన అతిధిలు, వాళ్ళలో ఎవరు బెస్ట్, తాను అడిగే విధానం, తన ప్రశ్నలు, వాళ్ళు ఇచ్చిన సమాధానాలు, వీటన్నిటిమీద ఒక రివ్యూ లా చేశాడు. ఈ చివరి ఎపిసోడ్ లో ఒక నలుగురు అతిధిలను పిలిచాడు. వాళ్ళు సినిమా పరిశ్రమకి చెందిన వాళ్ళు కాదు, సాంఘీక మాధ్యమాల్లో బాగా ప్రాచుర్యం పొందిన వాళ్ళు. వాళ్ళతో ఎవరు బెస్ట్ అతిధి అని అడిగినప్పుడు మన సమంతా పేరు చెప్పారు వాళ్ళు. అలాగే మగవాళ్ళలో అర్జున్ కపూర్ పేరు చెప్పారు. ఇంకా 7 వ సీజన్ మొత్తం ఎవరెవరు ఎలా చేశారు, ఎవరు బాగున్నారు, ఫాషన్ గురించి ఇంకా మొత్తం సీజన్ అంతా ఎలా సాగింది అన్న విషయాలు లాస్ట్ ఎపిసోడ్ లో ఆ నలుగురితో కరణ్ డిస్కస్ చేశాడు. 


ఇది ఇలా వుండగా, సీజన్ 8 లో తాను ఎలా వుండబోతున్నదీ కూడా చెప్పారు. ఈ సీజన్ 7 లో వచ్చిన అతిధిలను ఎక్కువ వారి యొక్క వ్యక్తిగత జీవితాలు, వాళ్ళు ఎవరితో వుంటున్నారు అన్న విషయాలు ఎక్కువగా కరణ్ అడిగాడు. అలాగే వాళ్ళతో సెక్స్ విషయాలు మీద కూడా ఎక్కువ ప్రశ్నలు అడిగి అదే పాయింట్ మీద కొందరిని గుచ్చి గుచ్చి అడిగాడు కూడా. అయితే వచ్చే 8 వ సీజన్ లో ఈ సెక్స్ అనే పదం అసలు వాడను అని చెప్పేశాడు. అది ఎక్కువయింది ఈ 7వ సీజన్ లో, దాని మీద బాగా విమర్శలు రావటం తో కరణ్ ఇంకా ఆ పదం ఎక్కువగా వాడను, దాని గురించి వచ్చే సీజన్ లో అడగను అని చెప్పేశాడు. అలాగే ఆలియా భట్ గురించి కూడా చాలా తక్కువ మాట్లాడుతాను అని చెప్పాడు. ఈ సీజన్ లో ఆమె గురించి చాలా ఎక్కువ మాట్లాడేడు అని ఆ వచ్చిన నలుగురు కరణ్ కి చెప్పడం తో  వచ్చే సీజన్ లో ఆమె గురించి తక్కువ మాట్లాడతా అని చెప్పాడు. అలాగే వచ్చే సీజన్ కొత్తగా వుంటుందని, కొత్తవాళ్ళని కూడా ఈ షో కి ఆహ్వానించనున్నట్టు చెప్పాడు. 


దక్షిణాదికి చెందిన నటీనటులు, ఈ షో లో పాల్గొనటం చాలా బాగుంది అని అన్నారు.  దక్షిణాదికి చెందిన నటీనటులు ఎక్కువ తమ గురించి మాట్లాడారు, కానీ ఈ సీజన్ లో విజయ్ దేవరకొండ, సమంతా బాగా మాట్లాడేరు ోలగ అతిధిలుగా వచ్చిన ఆ నలుగురు కితాబు ఇచ్చారు. 

ఇది ఒక మంచి పరిణామమే. అలాగే కరణ్ బూతులు ఎక్కువ మాట్లాడను అన్నది కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఈ 7 సీజన్ లో వాటి మీదే ఎక్కువ వొత్తిడి తెచ్చి మాట్లాడించేడు. వచ్చే సీజన్ లో వచ్చిన అతిధిల పర్సనాలిటీ గురించి ఎక్కువ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తే చాలా మంచిది.  తన్మయ్ భట్, కుషా కపిల, నీహారిక ఎన్ ఎం మరియు డానీష్ సైట్ చివరి ఎపిసోడ్ లో అతిధిలుగా వచ్చారు. 

Updated Date - 2022-10-01T19:07:19+05:30 IST