Steven Spielbergతో సమానంగా రాజమౌళిని పేర్కొన్న కరణ్ జోహర్! దర్శకులు కావాలనుకునే వారికి ఏం చెప్పాడంటే...

ABN , First Publish Date - 2022-04-03T19:14:58+05:30 IST

‘‘నువ్వు డైరెక్టర్ అవ్వటానికి ‘అది’ కారణం కాకూడదు. ‘అది’ నీ ‘ప్లాన్ బీ’ అవ్వకూడదు’’ అన్నాడు బాలీవుడ్ బడా డైరెక్టర్. అంతే కాదు, ఆయన దర్శకులు అవ్వాలని కోరుకునే ఔత్సాహికులకి...

Steven Spielbergతో సమానంగా రాజమౌళిని పేర్కొన్న కరణ్ జోహర్! దర్శకులు కావాలనుకునే వారికి ఏం చెప్పాడంటే...

తెర మీద సినిమా స్టార్స్ అవుదామని ఆశపడి... అందుకు తగిన లుక్స్ లేక... చివరకు తెర వెనుక దర్శకులుగా మారేవార్ని కరణ్ జోహర్ తీవ్రంగా తప్పుబట్టాడు. ‘‘నువ్వు డైరెక్టర్ అవ్వటానికి ‘అది’ కారణం కాకూడదు. ‘అది’ నీ ‘ప్లాన్ బీ’ అవ్వకూడదు’’ అన్నాడు బాలీవుడ్ బడా డైరెక్టర్. అంతే కాదు, ఆయన దర్శకులు అవ్వాలని కోరుకునే ఔత్సాహికులకి మరో కీలక సూచన కూడా చేశాడు. పెడ్రో అల్మోడోర్, స్టీవెన్ స్పిల్‌బర్గ్ లాంటి దిగ్గజ దర్శకుల చిత్రాలపై మంచి అవగాహన పెంచుకోవాలని సూచించాడు. కానీ, కరణ్ కామెంట్లో కొస మెరుపు ఏంటంటే... ఆయన పెడ్రో, స్పిల్‌బర్గ్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత దర్శకుల పేర్లతో పాటూ మన రాజమౌళి పేరు కూడా లిస్టులో చేర్చాడు. దర్శక ‘బాహుబలి’ సినిమాలు చూసి కొత్త దర్శకులు ఎంతో నేర్చుకోవచ్చని కేజో అభిప్రాయపడ్డాడు! 


ధర్మా ప్రొడక్షన్స్ అధినేత, అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు రూపొందించిన టాప్ డైరెక్టర్... కరణ్ జోహర్! అయినా కూడా ఆయన ఎటువంటి భేషజం లేకుండా రాజమౌళిని మెచ్చుకోవటం ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలా సార్లు పబ్లిగ్గా ‘రాజమౌళి సర్’ అంటూ సంబోధిస్తూ జక్కన్నని ఆకాశానికి ఎత్తేశాడు. ‘బాహుబలి’ లాంటి సినిమా ఏదో ఒక రోజు తాను కూడా తీస్తానని అప్పుడప్పుడూ కరణ్ అంటుంటాడు కూడా! ‘తఖ్త్’ అనే రాజుల కాలం నాటి పీరియాడికల్ సినిమా కొన్నాళ్ల క్రితం ఉత్సాహంగా మొదలు పెట్టాడు కేజో. అయితే, కొంత ప్రీ ప్రొడక్షన్ జరిగాక కరోనా లాక్‌డౌన్స్, కరణ్ చుట్టూ ముసురుకున్న వివాదాలు, విమర్శల కారణంగా అది మూలనపడింది. తన మల్టీస్టారర్ మ్యాగ్నమ్ ఒపస్ కథ ముగిసిపోయినట్టు మాత్రం కాదని ఆ మధ్య కరణ్ జోహార్ ప్రకటించాడు.    

Updated Date - 2022-04-03T19:14:58+05:30 IST