Hridayam రీమేక్‌‌లో బాలీవుడ్ స్టార్ హీరో తనయుడు..?

ABN , First Publish Date - 2022-05-29T21:30:38+05:30 IST

మలయాళం ఇండస్ట్రీలో భారీ విజయం సాధించిన సినిమా ‘హృదయం’ (Hridayam). వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. మోహన్‌లాల్ కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్(Pranav Mohanlal) హీరోగా నటించాడు.

Hridayam రీమేక్‌‌లో బాలీవుడ్ స్టార్ హీరో తనయుడు..?

మలయాళంలో భారీ విజయం సాధించిన సినిమా ‘హృదయం’ (Hridayam). వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. మోహన్‌లాల్ కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్(Pranav Mohanlal) హీరోగా నటించాడు. కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. రీమేక్ రైట్స్ కరణ్ జోహార్ (kalyani priyadarshan) దగ్గర ఉన్నాయి. స్టార్ స్టూడియోస్ నిర్మించనుంది. ‘హృదయం’ రీమేక్‌లో బాలీవుడ్ స్టార్ హీరో తనయుడు నటించనున్నట్టు వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి.


‘హృదయం’ రీమేక్‌తో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan)లాంచ్ కాబోతున్నట్టు బీ టౌన్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నిజానికి సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్‌ను ‘సింబా’ సినిమాతో కరణ్ జోహారే లాంచ్ చేయాలనుకున్నాడు. కానీ, ఆ ప్రాజెక్టు ఆలస్యం అయింది. దీంతో ‘కేదార్ నాథ్’ సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఈ సారి కరణ్ జోహార్ తప్పకుండా ఇబ్రహీం అలీ ఖాన్‌ను లాంచ్ చేయాలనే పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. ‘‘ఇబ్రహీం అలీఖాన్‌ను ఓ మంచి సినిమాతో లాంచ్ చేయాలని కరణ్ జోహార్ చూస్తున్నాడు. ‘హృదయం’ రీమేక్ బాగుంటుందని కరణ్ భావిస్తున్నాడు’’ అని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.  

Updated Date - 2022-05-29T21:30:38+05:30 IST