థాంక్ యూ MODI అంటోన్న Kapil Sharma... ‘కొత్త నాటకం’ అంటోన్న నెటిజన్స్...

ABN , First Publish Date - 2022-03-23T01:30:07+05:30 IST

ప్రముఖ కమెడియన్, నటుడు కపిల్ శర్మ ధన్యవాదాలు తెలిపాడు. ఏఎన్ఐ వార్త సంస్థ పోస్ట్ చేసిన ఒక వీడియోని షేర్ చేస్తూ కపిల్ మోదీ పేరుని ప్రస్తావించాడు..

థాంక్ యూ MODI అంటోన్న Kapil Sharma... ‘కొత్త నాటకం’ అంటోన్న నెటిజన్స్...

ప్రముఖ కమెడియన్, నటుడు కపిల్ శర్మ ధన్యవాదాలు తెలిపాడు. పురాతన కాలం నాటి 29 అమూల్యమైన వస్తువుల్ని ఆస్ట్రేలియా నుంచీ భారత్‌కు తిరిగి తెప్పించినందుకు ఆయన ప్రధానికి థాంక్స్ చెప్పాడు. ఏఎన్ఐ వార్త సంస్థ పోస్ట్ చేసిన ఒక వీడియోని షేర్ చేస్తూ కపిల్ మోదీ పేరుని ప్రస్తావించాడు. 


‘‘ఆస్ట్రేలియా నుంచీ అమూల్యమైన నిధుల్ని స్వదేశానికి తిరిగి తెప్పించినందుకు గౌరవనీయులైన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. జై భారత్. హర్ హర్ మహాదేవ్’’ అంటూ హిందీలో ట్వీట్ చేశాడు కపిల్ శర్మ.  అయితే, ఆయన షేర్ చేసిన వీడియోలో నరేంద్ర మోదీ పురాతన కాలపు విగ్రహాల్ని, ఇతర సామాగ్రిని ఆసక్తిగా పరిశీలిస్తుండటం మనం చూడవచ్చు. 


కపిల్ శర్మ తాజా ట్వీట్‌కు నెటిజన్స్ నుంచీ మిశ్రమ స్పందనలు ఎదురయ్యాయి. ఓ ట్విట్టర్ యూజర్ ‘‘పెయిడ్ ట్వీట్’’ అంటూ ఘాటుగా కామెంట్ చేశాడు. మరోకరు... ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమా ప్రమోట్ చేయకుండా ఇప్పుడొచ్చి నాటకాలు మొదలెట్టాడు అంటూ విమర్శించారు. 


గతంలో ఓ సారి అర్థ రాత్రి వేళ మోదీకి వ్యతిరేకంగా వివాదాస్పద ట్వీట్ చేశాడు కపిల్ శర్మ. అప్పట్నుంచీ రైట్ వింగ్ సోషల్ మీడియా యూజర్స్‌కి, కపిల్‌కి దూరం పెరుగుతూ వచ్చింది. పైగా అతను ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌కి సన్నిహితంగా ఉండటం కూడా మోదీ అభిమానులకి అసహనం కలిగిస్తూ ఉంటుంది. ఆ నేపథ్యంలో తాజాగా ‘కాశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మాటలు కపిల్‌కి మరోసారి ట్రోలింగ్ సెగ తగిలించాయి. తన సినిమాని కపిల్ శర్మ షోలో ప్రమోట్ చేసేందుకు అతను అంగీకరించలేదని వివేక్ అగ్నిహోత్రి అన్నాడు. అప్పట్నుంచీ చాలా మంది నెటిజన్స్ కపిల్‌ని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మోదీకి థాంక్స్ చెబుతూ కపిల్ చేసిన ట్వీట్ కూడా విమర్శలపాలవుతోంది. ‘ద కాశ్మీర్ ఫైల్స్’ విషయంలో మూటగట్టుకున్న చెడు ప్రచారం నుంచీ తప్పించుకోటానికే ప్రధాని పేరు వాడుకుంటున్నాడని చాలా మంది అంటున్నారు. అయితే, కపిల్‌కి మద్దతు పలుకుతూ మోదీ భక్తుల ట్రోలింగ్ దాడిని ఖండిస్తున్నారు కూడా... 

Updated Date - 2022-03-23T01:30:07+05:30 IST