Abhishek నోట Deepika పేరు... కావాలని చేసిన పని కాదంటోన్న జూనియర్ బచ్చన్!

ABN , First Publish Date - 2022-04-11T02:03:09+05:30 IST

అభిషేక్ బచ్చన్ నటించిన ‘దస్వీ’ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, మూవీ ప్రమోషన్ కోసం ‘ద కపిల్ శర్మ షో’కు వెళ్లారు టీమ్ మెంబర్స్. అక్కడ హోస్ట్ కపిల్ శర్మ ఓ ఇంట్రస్టింగ్ క్వశ్చన్ అభిషేక్ బచ్చన్‌ని అడిగాడు.

Abhishek నోట Deepika పేరు... కావాలని చేసిన పని కాదంటోన్న జూనియర్ బచ్చన్!

అభిషేక్ బచ్చన్ నటించిన ‘దస్వీ’ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, మూవీ ప్రమోషన్ కోసం ‘ద కపిల్ శర్మ షో’కు వెళ్లారు టీమ్ మెంబర్స్. అక్కడ హోస్ట్ కపిల్ శర్మ ఓ ఇంట్రస్టింగ్ క్వశ్చన్ అభిషేక్ బచ్చన్‌ని అడిగాడు. ‘‘...‘దస్వీ’ సినిమాలో ఉన్న ‘ఎవ్రీవన్ లవ్స్ దీపిక’ అనే డైలాగ్ స్క్రీప్ట్‌లోనే ఉందా? లేక మీరు ఇంప్రూవైజ్ చేశారా?’’ అన్నాడు! దానికి జూనియర్ బచ్చన్ ‘‘నో... నో...’’ అంటూ జవాబిచ్చాడు. ‘దీపికా అంటే అందరికీ ఇష్టం’ అన్న డైలాగ్ స్క్రిప్ట్‌లోనే ఉండిందట. తానేమీ మార్పులు, చేర్పులు చేయలేదని స్పష్టం చేశాడు... 


‘అందరికీ దీపికా అంటే ఇష్టం...’ అనే డైలాగ్ తానుగానీ మార్చాల్సి వస్తే ‘మరెవరి పేరో’ తలుచుకునేవాడ్ని అంటున్నాడు అభిషేక్ బచ్చన్! అంతే కాదు, ‘‘మళ్లీ ఇంటికి వెళ్లాలి కదా...’’ అని కూడా ఆయన కపిల్ శర్మతో అన్నాడు. అభిషేక్ ప్రస్తావించిన ఆ ‘మరెవరో’... ఐశ్వర్య రాయే! ‘ఎవ్రీవన్ లవ్స్ ఐశ్వర్య’ అని తాను అంటానని అభీ ఉద్దేశం! అలా కాకుండా తానే స్వంతంగా ‘దీపిక’ పేరు తలుచుకుంటే... ఇంటికి వెళ్లాక ఐశ్వర్య ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని కపిల్ శర్మకి స్మాల్ బి చెప్పకనే చెప్పాడు! నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలైన ‘దస్వీ’లో అభిషేక్ సరసన యమీ గౌతమ్, నిమ్రత్ కౌర్ కథానాయికలుగా నటించారు... 

Updated Date - 2022-04-11T02:03:09+05:30 IST