ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఇలా నటిస్తున్నారా.. కపిల్‌కి Rajamouli ఆన్సర్ ఏంటంటే..

ABN , First Publish Date - 2021-12-31T16:15:20+05:30 IST

‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి. ఇంతవరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సాగుతున్న ఈ దర్శకుడి తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’...

ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఇలా నటిస్తున్నారా.. కపిల్‌కి Rajamouli ఆన్సర్ ఏంటంటే..

‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి. ఇంతవరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సాగుతున్న ఈ దర్శకుడి తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7 విడుదల కానున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరోలు ఎన్‌టీఆర్, రామ్‌‌చరణ్ లీడ్ రోల్స్‌లో పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ది కపిల్ శర్మ షో’ పాల్గొంది ఈ మూవీ టీం.


కపిల్ శర్మ హోస్ట్‌గా చేస్తున్న ఈ షో రాబోయే ఎపిసోడ్ ప్రోమోని యూట్యూబ్‌లో విడుదల చేసింది సోనీ టీవీ. ఈ షో డైరెక్టర్, హీరోలతో పాటు హీరోయిన్‌గా నటిస్తున్న అలియా భట్ సైతం పాల్గొంది. ఈ వీడియోలో చిత్ర బృందాన్ని యాంకర్ అడిగిన పలు ప్రశ్నలు అందరిని నవ్వుల్లో ముంచెత్తాయి.


కపిల్ ‘రాజమౌళి గొప్ప సినిమాలు తీస్తారు. అందుకే ఏనుగు మీద ఎంట్రీ ఇస్తారని అనుకున్నామ’ని డైరెక్టర్‌ని ఉద్ధేశించి జోక్ చేశాడు. ‘సర్ మీరు నిజంగా ఇంత సింపుల్‌గా ఉంటారా లేక ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఇలా నటిస్తున్నారా’ అని అడగగా రాజమౌళి నవ్వేశాడు. కానీ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. పూర్తి ఎపిసోడ్‌లో అయిన ఇచ్చాడో లేదో ప్రసారం అయిన తర్వాత చూడాలి.


అలాగే 8 కిలోల బరువు పెంచడానికి ఎన్‌టీఆర్ ఫిట్‌నెస్ ట్రైనర్ 18 నెలలు తీసుకున్నాడని తెలిసి దానిపై సైతం జోక్ చేశాడు కపిల్. ‘అతను నిజంగా మీ బరువు పెరిగేందుకు ట్రైనింగ్ ఇచ్చాడా లేక తన పేమెంట్ పెంచుకోవడానికా’ అని కామెంట్ చేశాడు. 


అలియాకి సెంట్ అంటే చాలా ఇష్టమని తెలిసిన కపిల్.. ఆ భామని ఉద్ధేశించి మాట్లాడుతూ.. ‘ఎవరైనా నీకు ప్రపోజ్ చేస్తే.. ఆలోచిస్తానని చెబుతావా లేక స్మెల్ చూసి చెబుతావా’ అంటూ ప్రశ్నించాడు యాంకర్. దానికి ఈ బ్యూటీ నవ్వుతూ ‘నాకేవరైతే ప్రపోజ్ చేశాడో.. అతని వాసన ఆల్రేడి చూసేశాన’ని చెప్పుకొచ్చింది.


అంతేకాకుండా ఈ షోలోని ‘పోస్ట్‌కి పోస్ట్‌మార్టమ్’లో గెస్ట్స్‌ని కొన్ని ఫన్నీ కామెంట్స్ గురించి అడిగాడు కపిల్. కాగా, తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’గా విడుదల అవుతున్న ‘ఆర్ఆర్ఆర్’.. హిందీలో ‘రైస్ రోర్ రివోల్ట్‌గా రానుంది. కాగా, ఆ ఫన్నీ ప్రోమోని మీరు ఓ సారి చూసేయండి..



Updated Date - 2021-12-31T16:15:20+05:30 IST