Kantara: ఆ హద్దులేం లేవు.. దేనికైనా రెడీ అంటున్న హీరోయిన్ సప్తమి గౌడ

ABN , First Publish Date - 2022-10-18T16:06:20+05:30 IST

‘కాంతార’ (Kantara).. ఇప్పుడు దేశం మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటోంది. ఈ చిత్రంతో దర్శకుడిగా, హీరోగా రిషబ్ శెట్టి (Rishab Shetty)కి,

Kantara: ఆ హద్దులేం లేవు.. దేనికైనా రెడీ అంటున్న హీరోయిన్ సప్తమి గౌడ

‘కాంతార’ (Kantara).. ఇప్పుడు దేశం మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటోంది. ఈ చిత్రంతో దర్శకుడిగా, హీరోగా రిషబ్ శెట్టి (Rishab Shetty)కి, హీరోయిన్‌గా సప్తమి గౌడ (Saptami Gowda)కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ తరుణంలో ‘కాంతార’ హిట్ గురించి సప్తమి మాట్లాడింది. ఒక వైపు పాన్‌ ఇండియా చిత్రాలు, మరోవైపు ఓటీటీ ఫ్లాట్‌ఫాంల కారణంగా చిత్ర పరిశ్రమలో భాషా సరిహద్దులు చెరిగిపోయాయని ఈ కన్నడ బ్యూటీ పేర్కొంది. ఈ సినిమాకి విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నట్లే.. ఈ సినిమాకు తమిళంలోనూ, తెలుగులోనూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని సంతోసం వ్యక్తం చేసింది. సప్తమి గౌడ మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్టు కోసం మొదట నన్ను సంప్రదించినప్పుడు స్టోరీ, పాత్రకు సంబంధించి ఏ విషయం కూడా నాకు తెలియదు. కానీ, నాపై నమ్మకం ఉంచి హీరోయిన్‌గా ఈ చిత్ర దర్శకుడు, హీరో రిషబ్‌ ఎంపిక చేశారు. దానికి ఆయనకి ధన్యవాదాలు చెబుతున్నాను. ఇకపై ఇతర భాషల్లో అవకాశాలు వస్తే ఏ మాత్రం సంకోచించకుండా నటిస్తాను. వాటికి ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు’ అని చెప్పుకొచ్చింది.


కాగా.. మొదట కన్నడలో మాత్రమే విడుదలైన ‘కాంతార’ చిత్రం అక్కడ మంచి హిట్ సాధించింది. దాంతో.. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా డబ్ చేసి కొన్ని రోజుల గ్యాప్‌లో విడుదల చేశారు. ఈ మూవీ ప్రస్తుతం విజయవంతంగా రన్ అవుతూ.. మంచి కలెక్షన్లని కొల్లగొడుతుంది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకి పైగా వసూళ్లని సాధించింది.

Updated Date - 2022-10-18T16:06:20+05:30 IST