రికార్డు ధరకు అమ్ముడయిన కిచ్చా సుదీప్ 'Vikrant Rona' ఓవర్సీస్ హక్కులు

ABN , First Publish Date - 2022-05-09T01:43:28+05:30 IST

హిందీ జాతీయ భాష కాదని ఈ మధ్య పతకశీర్షికాలకెక్కిన వ్యక్తి కిచ్చా సుదీప్ ( Kichcha Sudeep). ప్రస్తుతం ‘విక్రాంత్ రోణ’ (Vikrant Rona) సినిమాలో నటిస్తున్నాడు

రికార్డు ధరకు అమ్ముడయిన కిచ్చా సుదీప్ 'Vikrant Rona' ఓవర్సీస్ హక్కులు

హిందీ జాతీయ భాష కాదని ఈ మధ్య పతాకశీర్షికలకెక్కిన వ్యక్తి కిచ్చా సుదీప్ ( Kichcha Sudeep). ప్రస్తుతం ‘విక్రాంత్ రోణ’ (Vikrant Rona) సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికీ అనుప్ భండారి (Anup Bhandari) దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ పాన్ ఇండియాగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంపై మంచి బజ్ ఉండటంతో ఓవర్సీస్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. 


‘విక్రాంత్ రోణ’ ఓవర్సీస్ హక్కులను ‘వన్ ట్వంటీ 8 మీడియా’ (One Twenty 8 media) దక్కించుకుంది. భారీ మొత్తం చెల్లించి ఆ హక్కులను సొంతం చేసుకుంది. డిస్ట్రిబ్యూషన్ సంస్థ దాదాపుగా రూ. 10కోట్లను చెల్లించిందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జులై 28న విడుదల కానుంది.  ఈ చిత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez), నిరుప్ భండారి, నీతా అశోక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్ తో కలసి జాక్ మంజునాథ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా గురించి కొన్ని రోజుల క్రితం నిర్మాత జాక్ మంజునాథ్ మీడియాతో మాట్లాడాడు. ‘‘ఈ సినిమాలోని కథ యూనివర్శల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ చిత్రంలోని ఎమోషన్స్ అర్థం అవుతాయి. ఓవర్సీస్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడయినందుకు సంతోషంగా ఉంది. కన్నడ సినిమాకు ఇంత ధర చెల్లించడం ఇదే మొదటిసారి’’ అని నిర్మాత మంజునాథ్ తెలిపాడు.

Updated Date - 2022-05-09T01:43:28+05:30 IST