KGF సినిమాలో చిన్న పాత్రే.. కానీ ఫ్యాన్స్‌తో విజిల్స్ తెప్పించిన ఈ నటుడు ఇకలేరు..!

ABN , First Publish Date - 2022-05-07T20:54:47+05:30 IST

కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్‌గా ఫేమ్ సంపాదించుకున్న నటుడు మోహన్ జునేజా(Mohan Juneja). దాదాపుగా 100కు పైగా సినిమాల్లో నటించారు. ఉపేంద్ర(upendra), పునీత్ రాజ్ కుమార్

KGF సినిమాలో చిన్న పాత్రే.. కానీ ఫ్యాన్స్‌తో విజిల్స్ తెప్పించిన ఈ నటుడు ఇకలేరు..!

కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్‌గా ఫేమ్ సంపాదించుకున్న నటుడు మోహన్ జునేజా(Mohan Juneja). దాదాపుగా 100కు పైగా సినిమాల్లో నటించారు. ఉపేంద్ర(upendra), పునీత్ రాజ్ కుమార్ (puneeth rajkumar) వంటి స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఈ పాపులర్ నటుడు, కమెడియన్ మే 7న ఉదయం మృతి చెందారు. 


మోహన్ జునేజా చివరగా ‘కెజియఫ్: చాప్టర్-2’(kgf chapter 2)లో నటించారు. ఈ సినిమాలో నాగరాజు పాత్రలో కనిపించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వైద్యం అందించినప్పటికీ స్పందించక 54ఏళ్ల వయసులో ఆయన మరణించారు. శంకర్ నాగ్ (Shankar Nag) తెరకెక్కించిన ‘వాల్ పోస్టర్’ (Wall Poster) సినిమాతో మోహన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘చెల్లాట’ (Chellata) చిత్రం ఆయనకు స్టార్‌డమ్‌ను తీసుకు‌వచ్చింది. పలు టివీ సీరియల్స్‌లోను నటించారు. ‘వితారా’ (Vitara) టెలివిజన్ షో ఆయనకు మంచి పేరును తీసుకువచ్చింది. సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం కెరీర్‌ను కొనసాగించారు. ‘కెజియఫ్: చాప్టర్-1’(kgf chapter 1), ‘లక్ష్మీ’(Lakshmi), ‘బృందావన’ (Brindavana), ‘పదే పదే’ ( Pade Pade), ‘కోకో’ (Koko) వంటి చిత్రాల్లో నటించారు. మోహన్ జునేజా మృతితో కన్నడ ఇండస్ట్రీ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. పలువురు ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ‘కెజియఫ్’ను నిర్మించిన ‘హోంబలే ఫిలింస్’ సోషల్ మీడియలో సంతాపాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టింది.



Updated Date - 2022-05-07T20:54:47+05:30 IST