Maheshకు తండ్రిగా కన్నడ స్టార్ ..?

ABN , First Publish Date - 2022-05-31T13:57:13+05:30 IST

ఇటీవల సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చి మంచి కమర్షియల్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu)

Maheshకు తండ్రిగా కన్నడ స్టార్ ..?

ఇటీవల సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చి మంచి కమర్షియల్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu) మరో రెండు ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో ఒక సినిమాను మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas), మరోటి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (S S Rajamouli) తెరకెక్కించబోతున్నారు. ముందుగా త్రివిక్రమ్ సినిమా సెట్స్‌పైకి రాబోతుంది. ప్రస్తుతం మహేశ్ తన భార్య పిల్లలతో కలిసి విదేశాలలో పర్యటిస్తున్నారు. 


ఇది ముగిసిన తర్వాత త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నారు. ‘అర్జునుడు’ (Arjunudu) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుందట. మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజ హెగ్డే (Pooja Hegde) ఈ సినిమాలో మహేశ్ సరసన హీరోయిన్‌గా నటించనుంది. ఎస్ ఎస్ థమన్ (S S Thaman) సంగీతం అందిస్తున్నారు. అయితే, ఈ మూవీలో ఓ పవర్ ఫుల్ రోల్ ఉందట. అది మహేశ్ బాబుకు తండ్రి పాత్ర అని..దీని కోసం కన్నడ స్టార్ వి. రవిచంద్రన్‌ (V. Ravichandran)ను తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన ఎంపిక జరిగిందని, త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. 


కాగా, ఈ చిత్రాన్ని జులై నుంచి సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ముందుగా మహేశ్‌పై ఓ సోలో సాంగ్‌ను.. అలాగే, ఒక ఫైట్‌ను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఆ తర్వాత లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసి మెజారిటీ భాగం టాకీ పార్ట్‌ను పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. దాదాపు పదకొండు సంవత్సరాల తరువాత మహేశ్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూవీ రాబోతుండటం విశేషం. ఇక ఈ మూవీలో రెండు విభిన్నమైన పాత్రల్లోనూ నటిస్తున్నట్టు తాజా సమాచారం.  త్రివిక్రమ్ సినిమా పూర్తి చేసిన తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమాను చేయనున్నారు. దీని కోసం రాజమౌళికి మహేశ్ బల్క్ డేట్స్ ఇచ్చారట. కీరవాణి సంగీతం అందించనున్న ఈ మూవీకి కథ వి విజయేంద్ర ప్రసాద్. 

Updated Date - 2022-05-31T13:57:13+05:30 IST