Kanika : ‘ఊ బోలేగా’ ఫేం కనికా కపూర్‌కు మరో పెళ్లి–ఉపాసన సందడి!

ABN , First Publish Date - 2022-05-21T20:19:07+05:30 IST

‘పుష్ప’ చిత్రంలో ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా’ పాట ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే! అదే పాటను ‘ఊ.. బోలేగా యా ఊఊ బోలేగా’ అంటూ హిందీలో ఆలపించారు కనికా కపూర్‌. పలు బాలీవుడ్‌ చిత్రాలతోపాటు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌కు పాటలు పాడి బీటౌన్‌లో పాపులర్‌ సింగర్‌గా పేరొందిన కనికా కపూర్‌ తాజాగా రెండో వివాహం చేసుకున్నారు.

Kanika : ‘ఊ బోలేగా’ ఫేం కనికా కపూర్‌కు మరో పెళ్లి–ఉపాసన సందడి!

‘పుష్ప’ చిత్రంలో ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా’(Pushpa song fame) పాట ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే! అదే పాటను ‘ఊ.. బోలేగా యా ఊఊ బోలేగా’ అంటూ హిందీలో ఆలపించారు కనికా కపూర్‌(Kanika kapoor). పలు బాలీవుడ్‌ చిత్రాలతోపాటు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌కు పాటలు పాడి బీటౌన్‌లో పాపులర్‌ సింగర్‌గా పేరొందిన కనికా కపూర్‌ తాజాగా రెండో వివాహం చేసుకున్నారు. లండన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను ప్రేమించిన ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకలో రామ్‌చరణ్‌ భార్య, కనికాకు స్నేహితురాలు అయిన ఉపాసన (Upasana konidela) పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 


1998లో లండన్‌కు చెందిన రాజ్‌తో కనికాకపూర్‌కు వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. వ్యక్తిగత కారణాల వల్ల 2012లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సింగింగ్‌ కెరీర్‌ మీద దృష్టి పెట్టి సక్సెస్‌ అయ్యారు కనికా. తాజాగా అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’(pushpa) సినిమాలోని ‘ఊ అంటావా ఊఊ అంటావా’ హిందీ వెర్షన్‌ని పాడి హిట్‌ అందుకున్నారు. 






Updated Date - 2022-05-21T20:19:07+05:30 IST