మాటలను బాణాల ఎక్కు పెట్టే బాలీవుడ్ నటి కంగనా రనౌత్. నాగచైతన్య-సమంత విడిపోతునట్టు ప్రకటించడంతో చై పై మాటల దాడికి దిగింది. అందుకు ఆమిర్ ఖానే కారణమని ఆరోపించింది. ఆమిర్‌ను చూసే చై నేర్చుకున్నాడని వెల్లడించింది. ఆర్యన్‌కు తన మద్దతును ప్రకటించడంతో హృతిక్‌పై కూడా విరుచుకుపడింది. ఆ రెండు ఘటనలను అందరూ మరువక ముందే సోషల్ మీడియాలో మరోక పోస్టు పెడుతూ సంచలనానికి తెర లేపింది.
షారూఖ్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక పోస్టు పెట్టింది. జాకీ చాన్, అతని కుమారుడు, పోలీసులు ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. ‘‘ జాకీచాన్ కుమారుడు 2014లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అప్పుడు జాకీచాన్ అఫిషియల్‌గా క్షమాపణలు కోరాడు. తన కుమారుడు ఈ విధంగా చేయడంతో సిగ్గుపడుతున్నానన్నాడు. అతణ్ని రక్షించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయనన్ని చెప్పాడు. అతడు ఆరు నెలలు జైలు శిక్ష అనంతరం కూడా క్షమాపణలు చెప్పాడు. #just saying ’’అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకుని 14రోజులు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అతడి డ్రైవరిని కూడా ఎన్సీబీ అధికారులు సమన్లు అందించి దర్యాప్తు చేశారు. రవీనా టండన్, సోమీ అలీ, జానీ లీవర్, విశాల్ దడ్లానీతో సహా బాలీవుడ్‌కు చెందిన అనేక మంది సెలెబ్రిటీలు షారూక్ తనయుడికి ఇప్పటికే తమ మద్దతును తెలిపారు.