Emergency Teaser Out: ఇందిరా గాంధీగా Kangana Ranaut.. స్టన్ అవుతున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2022-07-14T19:03:03+05:30 IST

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. గతేడాది.. తమిళనాడు మాజీ సీఎం జయలలిత..

Emergency Teaser Out: ఇందిరా గాంధీగా Kangana Ranaut.. స్టన్ అవుతున్న నెటిజన్లు

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. గతేడాది.. తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవిత కథతో వచ్చిన ‘తలైవి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ భామ వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవలే కంగనా నటించి స్పై, యాక్షన్ థ్రిల్లర్ ‘ధాకడ్’ విడుదలైంది. అయితే.. ఈ మూవీ ఘోర పరాజయం పాలైంది. అయినప్పటికీ ఈ తార వెనక్కి తగ్గకుండా భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) విధించిన ‘ఎమర్జెన్సీ (Emergency)’ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కిస్తోంది.


సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈ కంగనానే స్వీయ దర్శకత్వంలో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ వీడియోని తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. షూటింగ్ ప్రారంభమైందని తెలియజేసేందుకు మూవీ టీం ఈ ఫస్ట్ లుక్ టీజర్‌ని రీలీజ్ చేసింది. ఆ వీడియోలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా కరెక్టుగా సరిపోయింది. ముఖ్యంగా మాజీ ప్రధాని లాగా ఆహార్యం, ముఖ కవళికలు, యాటిట్యూడ్‌తో ఈ భామ మెస్మరైజ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో పలువురు నెటిజన్లు కంగనాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


‘మాజీ పీఎం ఇందిరా గాంధీలాగా కంగనా జీవిచేసి.. దేశంలోనే గొప్ప నటిగా నిరూపించుకుంది. నిజం చెప్పాలంటే.. మాటలు రావడం లేదు’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ‘ఓ మై గాడ్.. ఇందిరాగాంధీగా కంగనా ఫర్పెక్ట్‌గా సెట్ అయ్యింది’ అని మరొకరు.. ‘పర్ఫెక్ట్ యాక్టర్ సినిమా తీస్తే.. ఫలితం ఇలా ఉంటుంది’ అంటూ ఇంకొకరు ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.















Updated Date - 2022-07-14T19:03:03+05:30 IST