Kangana Ranaut vs Brahmastra: బ్రహ్మాస్త్ర సినిమా కలెక్షన్లపై క్లారిటీ ఇవ్వండి.. కరణ్ జోహర్‌ను కడిగేసిన కంగనా రనౌత్

ABN , First Publish Date - 2022-09-12T19:27:56+05:30 IST

భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 9న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన చిత్రం ‘బ్రహ్మాస్త్ర(Brahmastra)’. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్..

Kangana Ranaut vs Brahmastra: బ్రహ్మాస్త్ర సినిమా కలెక్షన్లపై క్లారిటీ ఇవ్వండి.. కరణ్ జోహర్‌ను కడిగేసిన కంగనా రనౌత్

భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 9న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన చిత్రం ‘బ్రహ్మాస్త్ర(Brahmastra)’. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహర్ (Karan Johar) నిర్మించాడు. ఈ మూవీ రీలీజైన మొదటి రోజే డివైడ్ టాక్‌ని సొంతం చేసుకుంది. అయితే.. కరణ్ మాత్రం ఈ మూవీ సూపర్ హిట్ అని తేల్చేశాడు. అంతేకాకుండా.. మొదటి రోజు రూ.75 కోట్లతోపాటు.. రెండు రోజుల్లో రూ.160 కోట్ల వసూళ్లు సాధించినట్లు పోస్టులు పెట్టాడు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ ఫేక్ అంటూ కామెంట్స్ సైతం చేశారు.


ఇదే తరుణంలో ఆ లెక్కలను ప్రశ్నిస్తూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీని షేర్ చేసింది. అందులో.. ‘నేను కరణ్ జోహార్‌ని ఇంటర్వ్యూలో చేయాలని కోరుకుంటున్నా. అందులో.. ఆయన ఎందుకు గ్రాస్ కలెక్షన్లని చెబుతున్నారో.. నెట్ కలెక్షన్లను ఎందుకు చెప్పట్లేదో తెలుసుకోవాలని అనుకుంటున్నా. రూ.650 కోట్ల సినిమా రెండు రోజుల్లో రూ.60 కోట్ల (వారు అలా చెబుతున్నారు. కానీ నేను నమ్మట్లేదు) నెట్ కలెక్షన్లని సాధించింది. అలాంటి సినిమా హిట్ అని ముందే ఎలా తేల్చేశారు. కరణ్ జోహార్ జీ దయచేసి ఆ విషయాన్ని మాకు తెలియజేయండి. ఎందుకంటే.. బాలీవుడ్‌లోని మూవీ మాఫియా ప్రవర్తన వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. నాలాంటి సాధారణ వ్యక్తులకి ఒకలాగా.. మీలాంటి విశిష్టమైన వ్యక్తులకి మరోలా పని చేస్తుంటుంది. దయచేసి దీని గురించి మాకు కొంచెం జ్ఞానోదయం కలిగించండి’ అంటూ.. కరణ్ జోహార్‌ని సోషల్ మీడియాలోనే పరోక్షంగా కడిగేసినంత పని చేసింది.



Updated Date - 2022-09-12T19:27:56+05:30 IST