Kangana Ranaut : దేవుడా... తక్కువ పోలీస్ కంప్లైంట్స్, ఎక్కువ LOVE LETTERS ప్రసాదించు స్వామీ!

ABN , First Publish Date - 2022-01-02T01:18:18+05:30 IST

2021 ముగిసి 2022లోకి ప్రపంచం కాలుమోపుతోన్న వేళ... ‘క్వీన్’ ఆఫ్ బాలీవుడ్ కంగనా... గుళ్లు సందర్శిస్తూ, దేవుళ్లని దర్శిస్తూ కాలం గడిపింది. తిరుమల వేంకటేశ్వరునికి మొక్కుకున్న ఆమె శ్రీకాళహస్తీశ్వరుని కూడా ఆరాధించింది. అయితే, శివుని సన్నిధిలో 34 ఏళ్ల రనౌత్ రాహు, కేతు పూజలు కూడా చేసింది...

Kangana Ranaut : దేవుడా... తక్కువ పోలీస్ కంప్లైంట్స్, ఎక్కువ LOVE LETTERS ప్రసాదించు స్వామీ!

2021 ముగిసి 2022లోకి ప్రపంచం కాలుమోపుతోన్న వేళ... ‘క్వీన్’ ఆఫ్ బాలీవుడ్ కంగనా... గుళ్లు సందర్శిస్తూ, దేవుళ్లని దర్శిస్తూ కాలం గడిపింది. తిరుమల వేంకటేశ్వరునికి మొక్కుకున్న ఆమె శ్రీకాళహస్తీశ్వరుని కూడా ఆరాధించింది. అయితే, శివుని సన్నిధిలో 34 ఏళ్ల రనౌత్ రాహు, కేతు పూజలు కూడా చేసింది. ఆ సందర్భంలో తీసిన పోటోల్ని సొషల్ మీడియాలో షేర్ చేసింది. 


రాహు, కేతు పూజ కోసం శ్రీకాళహస్తి చేరిన కంగనా సంప్రదాయబద్ధమైన చీరకట్టులో నుదుటన బొట్టుతో ప్రత్యేకంగా కనిపించింది. ‘‘ప్రపంచంలో రాహు, కేతువులకి ఒకే ఒక్క ఆలయం ఉంది. అది తిరుపతి బాలాజీకి సమీపంలో ఉంది. అక్కడ కొన్ని క్రతువులు నిర్వహించాను...’’ అంటూ ఆమె తన ఫాలోయర్స్‌కి వివరించింది. దేవుడ్ని తాను పూజల సందర్భంగా ఏం కోరుకుందో కూడా చెబుతూ ‘‘నా ప్రియమైన శత్రువుల నుంచీ దయని కోరుకుంటూ అక్కడికి వెళ్లాను. ఈ కొత్త సంవత్సరంలో... నాకు తక్కువ పోలీస్(కంప్లైంట్స్)/ఎఫ్‌ఐఆర్స్ కావాలి. ఎక్కువ ప్రేమ లేఖలు కావాలి’’ అందామె! 

Updated Date - 2022-01-02T01:18:18+05:30 IST