అదో పెద్ద స్కామ్.. హృతిక్ రోషన్‌పై Kangana Ranaut సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-04-10T15:34:30+05:30 IST

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ‘లాకప్’ అనే షోకి హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో భాగంగా..

అదో పెద్ద స్కామ్.. హృతిక్ రోషన్‌పై Kangana Ranaut సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ‘లాకప్’ అనే షోకి హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో భాగంగా వివిధ అంశాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూనే షోని ముందుకు తీసుకువెళుతోంది. అందులో కొన్ని బాలీవుడ్ ఇండస్ట్రీపై, నటులపై కామెంట్స్ చేయగా.. మాజీ ప్రియుడు హృతిక్ రోషన్‌పై విమర్శలు చేసింది. ఆ షో తాజా ఎపిసోడ్‌లో సైతం ఈ నటుడిపై మరోసారి పరోక్షంగా విరుచుకుపడింది.


షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న మునవర్‌కి బ్లర్ చేసిన ఓ పిక్‌ని చూపించింది కంగన. అందులో.. మునవర్ ఓ మహిళ, ఓ బాబుతో కలిసి ఉన్నాడు. దాని గురించి చెప్పాలని అడగగా.. తను చెప్పలేనని ఈ నటుడు చెప్పుకొచ్చాడు. ఇంతలో కంగన అందుకొని.. ‘ప్రతి అమ్మాయి పెళ్లయిన పురుషుల ఆకర్షణలో పడిపోతుంది. నేను వ్యక్తిగత అనుభవం నుంచి మాట్లాడుతున్నాను. నేను మీ గురించి మాట్లాడటం లేదు.. కానీ పెళ్లైన మగాళ్లు మంచి అవగాహన కలిగి ఉండటం వల్ల ఇది జరగవచ్చు. యువతులను ఆకట్టుకునే అవసరమైన గిమ్మికులు అన్నీ చేస్తారు. అందుకోసం రకరకాల కథలను అల్లుతుంటారు. వాటిని భార్యకి, యువతులకు ఇలాంటి కథలను అవసరమైనప్పుడు చెబుతుంటారు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇంతలో మధ్యలోకి వచ్చిన మునవర్ ఆ కథలా, తన కథ కాదని తెలిపాడు.


కంగనా, అతని గురించి మాట్లాడట్లేదని మునవర్‌కి హామీ ఇచ్చింది. ఈ భామ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను మీ గురించి మాట్లాడటం లేదు.. కానీ చాలా మంది చిన్న వయస్సు అమ్మాయిలు దీనికి ఏదో విధంగా రిలేట్ అవుతారు. వారికి ఖచ్చితంగా నేనేం మాట్లాడుతున్నానో అర్థమవుతుంది. ఇది నా జీవితంలో జరిగిన ఒక పెద్ద కుంభకోణం. వారు చాలా కథలు చెబుతుంటారు. అందువల్ల ఆ పెళ్లయిన వ్యక్తిని అతని భార్య నుంచి రక్షించగలిగేది తామేనని చాలామంది యువతులు భావిస్తుంటారు. .. వారి భార్యల వైపు స్టోరీ వింటే అందరూ ఖచ్చితంగా షాక్ అవుతారు’ అని చెప్పింది. అయితే.. ఈ సంభాషణలో ఎక్కడ హృతిక్ రోషన్ పేరు చెప్పనప్పటికీ.. ఆమె గత వ్యాఖ్యలను బట్టి ఆయన గురించే మాట్లాడుతుందని అర్థమవుతోంది.

Updated Date - 2022-04-10T15:34:30+05:30 IST