చిన్న పిల్లలు అలా చేయొచ్చా.. అలియాపై కంగన రనౌత్ విమర్శలు

ABN , First Publish Date - 2022-02-14T21:44:25+05:30 IST

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ ఏ విషయం మీదైనా ఎటువంటి బెరుకు లేకుండా మాట్లాడుతుందనే విషయం తెలిసిందే.

చిన్న పిల్లలు అలా చేయొచ్చా.. అలియాపై కంగన రనౌత్ విమర్శలు

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ ఏ విషయం మీదైనా ఎటువంటి బెరుకు లేకుండా మాట్లాడుతుందనే విషయం తెలిసిందే. అది రాజకీయాలైనా, సినిమాలైనా అనిపించింది చెప్పేస్తుంది. ఇటీవలే దీపిక సినిమాని అశ్లీల సినిమాతో పోల్చిన ఈ భామ.. తాజాగా అలియా భట్‌పై ఫైర్ అయ్యింది.


టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ నటించిన తాజా చిత్రం ‘గంగుభాయ్ కతియావాడి’. ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ని అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని అలియా ఆహార్యానికి ఫిదా అవుతున్నారు. దీంతో చాలామంది ఆ సినిమాలోని కొన్ని సిన్స్‌పై ఆమెలాగే డ్రెస్‌ వేసుకొని రీల్స్ చేస్తున్నారు. అందులో చిన్న పిల్లలు సైతం ఉంటున్నారు. అందులో ఒక పాప మూవీలో అలియా లాగా నోట్లో బిడీ పెట్టుకుని ఆమెలాగే కొన్ని డైలాగులు చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. 


చిన్న పిల్లలు చేసిన ఆ వీడియోని చూసిన అలియా బాగా ఇంప్రెస్ అయ్యింది. 

సోషల్ మీడియా వేదికగా వారిని పొగడ్తలతో ముంచెత్తింది. ఈ పిల్లలు లెజెండ్స్, బుల్లి గంగుబాయి ఎంతో అందంగా ఉందని ప్రశంసించింది. అయితే ఇది నచ్చని కంగన, అలియాపై విమర్శలు గుప్పించింది.


కంగన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్టోరీలో.. ‘నోటిలో బీడీ పెట్టుకుని, ఈ చిన్నారి అసభ్యకరమైన డైలాగులతో సెక్స్ వర్కర్‌ని అనుకరించాలా?.. ఆమె బాడీ లాంగ్వేజ్ చూడండి. ఈ వయస్సులో ఆమెను అలా చూపడం సరైనదేనా? వందలాది మంది పిల్లలు ఇలాగే చేస్తున్నారు’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా మంత్రి స్మృతి ఇరానీని సైతం ట్యాగ్ చేసింది. ఇందులో అలియా పేరును ప్రస్తావించలేదు. కానీ ఆ పోస్ట్ చూసిన ఎవరికైన అది అలియా గురించేనని అర్థమవుతుంది.



Updated Date - 2022-02-14T21:44:25+05:30 IST