‘అవును.. Mahesh Babu అన్నదాంట్లో తప్పేముంది’.. మరోసారి బాలీవుడ్‌పై విరుచుకుపడ్డ Kangana Ranaut

ABN , First Publish Date - 2022-05-13T15:55:38+05:30 IST

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ముక్కుసూటితనం గురించి అందరికీ తెలిసిందే. ఏ విషయం మీదైన ఎటువంటి బెరుకు..

‘అవును.. Mahesh Babu అన్నదాంట్లో తప్పేముంది’.. మరోసారి బాలీవుడ్‌పై విరుచుకుపడ్డ Kangana Ranaut

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ముక్కుసూటితనం గురించి అందరికీ తెలిసిందే. ఏ విషయం మీదైన ఎటువంటి బెరుకు లేకుండా మాట్లాడుతుంటుంది. ముఖ్యంగా అవకాశం వచ్చినప్పుడల్లా బాలీవుడ్ (Bollywood) చిత్రపరిశ్రమపై విరుచుకు పడుతూ ఉంటుంది. తాజాగా మరోసారి బాలీవుడ్‌ ఇండస్ట్రీపై కంగన కామెంట్స్ చేసింది. 


కంగన తాజాగా నటించిన చిత్రం ‘ధాకడ్ (Dhaakad)’ త్వరలో విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ మూవీకి సంబంధించిన రెండో ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంగన బాలీవుడ్ తనని తట్టుకోలేదనే మహేశ్ బాబు కామెంట్స్‌పై స్పందించింది. కంగన మాట్లాడుతూ.. ‘అవును.. మహేశ్ అన్నది నిజమే. ఆయన్ని బాలీవుడ్ తట్టుకోలేదు. ఎందుకంటే ఆయన్ని బాలీవుడ్ నుంచి ఎంతోమంది సినిమా కోసం సంప్రదించారని నాకు తెలుసు. కానీ.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ దేశంలోనే నెంబర్ 1 ఇండస్ట్రీగా నిలిచింది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి తగిన రెమ్యూనరేషన్‌ని బాలీవుడ్ ఇవ్వలేదు.


ఇలాంటి చిన్న చిన్న విషయాలను ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. నిజం చెప్పాలంటే.. తన పరిశ్రమపై, ఆయన పనిపై గౌరవం చూపడం వల్లనే మహేశ్ ఈ స్థాయిలో ఉండగలిగాడు. దాన్ని మనం ఒప్పుకోవాలి. తెలుగు చిత్ర పరిశ్రమ గత 10, 15 ఏళ్లలో తమిళ పరిశ్రమతోపాటు ఇతర ఇండస్ట్రీలు అన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్లిపోయింది. కాబట్టి, వారి నుంచి మనం చాలా నేర్చుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-05-13T15:55:38+05:30 IST