ఆ బాలీవుడ్ స్టార్స్ అందరూ ఆ విషయంలో ఫెయిల్యూర్సే.. Kangana Ranaut సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-04-05T16:59:22+05:30 IST

బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ‘లాకప్’ అనే షోని హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందు నుంచే..

ఆ బాలీవుడ్ స్టార్స్ అందరూ ఆ విషయంలో ఫెయిల్యూర్సే.. Kangana Ranaut సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ‘లాకప్’ అనే షోని హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందు నుంచే ఎంతో బజ్ క్రియేట్ చేసిన ఈ షో విడుదల తర్వాత అదే స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందింది. అంతేకాకుండా ఈ బ్యూటీ యాంకరింగ్‌కి సైతం మంచి మార్కులే పడ్డాయి. అయితే షో మొదటి ఎపిసోడ్ నుంచి ఈ భామ బాలీవుడ్ స్టార్స్‌పైన ఏదో రకంగా కామెంట్స్ చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి కంగనా బీ టౌన్ స్టార్స్‌పై సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేసింది.


కంగన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ‘షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా, రణ్‌వీర్‌సింగ్ వంటి చాలామంది నటులుగా మంచి పాపులారిటీ సాధించారు. నటనలో విజయవంతమైన ఈ నటులు షో హోస్టింగ్ చేయడంలో మాత్రం విఫలమయ్యారు. అయితే అమితాబ్ బచ్చన్ జీ, సల్మాన్ ఖాన్ జీ, అలాగే కంగనా రనౌత్ మాత్రమే అలా రెండింట్లో ఇప్పటి వరకూ విజయవంతమయ్యారు. ఇలా సక్సెస్ కావడం ఎంతో సంతోషంగా ఉంది.


అసూయతో సినిమా మాఫియా నన్ను, నా షోని అప్రతిష్టపాలు చేయడానికి చేస్తుందని నేను ప్రత్యేకంగా అందరికీ చెప్పవసరం లేదు. ఆ షోని రక్షించడానికి నేను చాలా చేయాలి. కానీ నాపై వస్తున్న విమర్శలను నేను పట్టించుకోదలచుకోలేదు. నేను ఇతరులకి సపోర్టుగా నిలిస్తేనే.. నా కోసం కూడా నిలబడగలను. ఈ తరంలో ‘లాకప్’ షోతో విజయవంతమైన ఏకైక హోస్ట్‌ నేను కావడం ఓ అద్భుతం’ అంటూ రాసుకొచ్చింది.



Updated Date - 2022-04-05T16:59:22+05:30 IST