బొగ్గు గనిలో షూటింగ్... ముక్కుపుటాల్లోంచి మసి... Kangana చెప్పిన Dhaakad విశేషాలు!

ABN , First Publish Date - 2022-05-14T04:14:10+05:30 IST

బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ ‘ధక్కడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, యాక్షన్ థ్రిల్లర్ మూవీ గురించి వివరిస్తూ ఆమె బొగ్గు గనిలో తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది...

బొగ్గు గనిలో షూటింగ్... ముక్కుపుటాల్లోంచి మసి... Kangana చెప్పిన Dhaakad విశేషాలు!

బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ ‘ధక్కడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, యాక్షన్ థ్రిల్లర్ మూవీ గురించి వివరిస్తూ ఆమె బొగ్గు గనిలో తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. ‘‘మేం ఒక బొగ్గు గనిలో షూటింగ్ చేశాం. మా ఊపిరితిత్తులు మసితో నిండిపోయాయి...’’ అని కంగనా తెలిపింది. ఆ నల్లటి మసి మొత్తం వారి ముక్కుపుటాల్లోంచి బయటకు వచ్చేదట! ‘‘మేం విదేశాల్లోనూ, భారతదేశంలో కూడా చిత్రీకరణ జరిపాం. మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీలో షూటింగ్ చేశాం. అత్యంత క్లిష్టమైన వాతావరణాల్లో మా దర్శకుడు సినిమా తెరకెక్కించారు...’’ అని చెప్పుకొచ్చింది కంగనా... 


‘ధక్కడ్’ సినిమాలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ రోల్ చేస్తోన్న డేర్ డేవిల్ కంగనా 14 నిమిషాల పాటూ సాగే సుదీర్ఘమైన పోరాటంలో కనిపించనుందట. హిందీ సినిమా చరిత్రలోనే అంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్ లేదంటోంది టాలెంటెడ్ యాక్ట్రస్. అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కూడా ఆమె కామెంట్స్ చేసింది. హాలీవుడ్ చిత్రాల బారి నుంచీ మన ఇండియన్ స్క్ర్రీన్స్ ని కాపాడుకోవాలని కంగనా అంటోంది. భారతీయ చిత్రాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో రూపొంది ఇంగ్లీషు సినిమాలకు ధీటుగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని తను అభిప్రాయపడింది... 


‘ధక్కడ్’ సినిమా మే 20వ తేదీన జనం ముందుకు రాబోతోంది. రజనీశ్ గాయ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ అనేక అంచనాల మధ్య విడుదలకు సిద్ధం అవుతోంది. ఇంత కాలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసిన కంగనా ఇందులో ఒళ్లు గగుర్పొడిచే ఫైట్స్ చేయటం అందర్నీ ఆకట్టుకుంటోంది...  

Updated Date - 2022-05-14T04:14:10+05:30 IST