Kangana Ranaut: ఈ వయస్సులోనూ.. ఆమె ఒంటి చేత్తో బాలీవుడ్‌ని బతికిస్తోంది

ABN , First Publish Date - 2022-11-21T19:09:50+05:30 IST

బాలీవుడ్‌లో పాటు దేశవ్యాప్తంగా జరిగిన పలు అంశాలపై ఎటువంటి బెరుకు లేకుండా మాట్లాడే నటి కంగనా రనౌత్..

Kangana Ranaut: ఈ వయస్సులోనూ.. ఆమె ఒంటి చేత్తో బాలీవుడ్‌ని బతికిస్తోంది

బాలీవుడ్‌లో పాటు దేశవ్యాప్తంగా జరిగిన పలు అంశాలపై ఎటువంటి బెరుకు లేకుండా మాట్లాడే నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). అందుకే ఈ బ్యూటీని బీ టౌన్ జనాలు ఫైర్ బ్రాండ్ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే.. పలుమార్లు ఈ భామ చేసే కామెంట్స్ వివాదాలకి సైతం దారి తీస్తుంటాయి. అయితే.. ఈ భామ ఇటీవల ఎక్కువగా బాలీవుడ్ సినిమాలపై కామెంట్స్ చేస్తోంది. తాజాగా సైతం కంగన మరోసారి హిందీ సినిమాలపై తన ఓపినియన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. 50 ఏళ్ల వయస్సులోనూ టబు (Tabu) ఒంటి చేత్తో హిందీ చిత్రసీమని బతికిస్తోందని చెప్పుకొచ్చింది.


కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్టోరీలో.. ‘ఈ సంవత్సరం రెండు హిందీ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అయ్యాయి. అవి భూల్ భూలయ్యా 2, దృశ్యం 2. ఈ రెండు చిత్రాలలో సూపర్ స్టార్ టబు ప్రధాన పాత్రలో నటించారు. ఆమె 50 ఏళ్లలో వయస్సులో ఒంటరిగా హిందీ చిత్ర పరిశ్రమను కాపాడింది. ఆమె ప్రతిభను ఎవరు, ఎప్పుడు ప్రశ్నించలేరు. అయినా 50 ఏళ్ల వయస్సులోనూ స్టార్‌గా నిలవడం మాత్రం అద్భుతం అని చెప్పాలి. మహిళలు తమ పని పట్ల అచంచలమైన అంకితభావానికి ఇంకా ఎక్కువ క్రెడిట్‌కు అర్హులని నేను భావిస్తున్నాను. ఆమె ఎంతోమందికి స్ఫూర్తి’ అని రాసుకొచ్చింది.


కాగా.. వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకెళుతున్న కంగనా ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ అనే చిత్రంలో నటిస్తోంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హాయాంలో వచ్చిన ‘ఎమర్జెన్సీ’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కంగనా ‘ఇందిరా గాంధీ’ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది.





Updated Date - 2022-11-21T19:09:50+05:30 IST