Emergency ప్రకటించిన బాలీవుడ్ క్వీన్

ABN , First Publish Date - 2022-07-04T14:40:04+05:30 IST

కరోనా సీజన్ లో వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది బాలీవుడ్ క్వీన్ కంగానా రనౌత్ (Kangana ranaut). ఒక పక్క ‘తలైవి’ (Thalaivi) లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించిన కంగానా.. మరోవైపు ‘థాకడ్’ (Thakad) అనే పక్కా యాక్షన్ చిత్రంతోనూ బరిలోకి దిగింది.

Emergency ప్రకటించిన బాలీవుడ్ క్వీన్

కరోనా సీజన్ లో వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది బాలీవుడ్ క్వీన్ కంగానా రనౌత్ (Kangana ranaut). ఒక పక్క ‘తలైవి’ (Thalaivi) లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించిన కంగానా.. మరోవైపు ‘థాకడ్’ (Thakad) అనే పక్కా యాక్షన్ చిత్రంతోనూ బరిలోకి దిగింది. కానీ ఈ రెండూ పరాజయం పాలయ్యాయి. ఈ ఏడాది ‘లాకప్’ (Lockup) పేరుతో హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయినా.. సినిమాల పరంగా.. పరాజయాలు మూటగట్టుకుంది. ముఖ్యంగా ‘థాకడ్’ భారీ డిజాస్టర్ చవిచూశాకా కంగానాకి నోటమాటరాని పరిస్థితి. మార్కెట్లో ఆమె ఇమేజ్ ఒక్కసారిగా ఆ సినిమాతో డ్యామేజ్ అయింది. రూ. 90కోట్లు బడ్జెట్ పెట్టిన ఈ సినిమాకి కేవలం రూ. 3కోట్లు షేర్ వచ్చిందంటే ఆ సినిమా ఏ స్థాయిలో పరాజయం పాలైందో అర్ధమవుతోంది. ఈ మూవీ ఫ్లాప్ తర్వాత కంగనా కొంతకాలం ఎలాంటి సౌండ్ లేకుండా ఉండిపోయింది. 


ఎట్టకేలకు కంగానా తన కొత్త చిత్రంతో తిరిగి రీఛార్జ్ కాబోతోంది. సైలెంట్ గా చిత్రాన్ని ప్రారంభించింది. తన సొంత నిర్మాణ సంస్థ మణికర్ణికా ఫిల్మ్స్ (Manikarnika Films) లో కొత్త సినిమా చేయబోతున్నట్టు ఇదివరకే వార్తలొచ్చాయి. తాజాగా కంగానా తన ఇన్ స్టామ్ ఫ్రొఫైల్ లో తన ఓన్ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని ప్రకటించింది. దీనికి ‘ఎమర్జెన్సీ’ (Emergency) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ కంగానా తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఒక ఫోటోని షేర్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం కంగానా మళ్ళీ మెగాఫోన్ పట్టబోతోంది. మణికర్ణిక తర్వాత కంగానా డైరెక్ట్ చేయబోయే మరో సినిమా ఇది. 


1977లో ఇందిరాగాంధీ (Indira Gandhi) ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె ప్రకటించిన ఎమర్జెన్సీ ఎలాంటి పరిస్థితులకు దారితీసిందో తెలిసిందే. దాని వల్ల మనదేశం ఎలాంటి సంక్షోభంలో పడింది? దానివల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? దాని వెనుక గల రాజకీయ కుట్రల నేపథ్యంలో ‘ఎమర్జెన్సీ’ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం. ఈ పొలిటికల్ పీరియాడికల్ డ్రామాలో ఇందిరాగాంధీగా కంగనా నటించబోతున్నట్టు టాక్. జీవి ప్రకాశ్ కుమార్ (GV Prakash KUmar) సంగీతం అందిస్తున్న ఈ సినిమా అయినా కంగానాకి మంచి హిట్టిస్తుందేమో చూడాలి.    

Updated Date - 2022-07-04T14:40:04+05:30 IST