‘Kangana ఫైల్స్’తో జనం ముందుకు రాబోతోన్న ‘Kashmir ఫైల్స్’ డైరెక్టర్!

ABN , First Publish Date - 2022-03-18T03:32:52+05:30 IST

బాలీవుడ్ కాంట్రవర్సీ ‘క్వీన్’ కంగనా ఓ అత్యంత ఆసక్తికర చిత్రానికి సిద్ధమవుతోందా? అవుననే అంటున్నారు బీ-టౌన్ బఫ్స్. ఇంతకీ విషయం ఏంటంటే...

‘Kangana ఫైల్స్’తో జనం ముందుకు రాబోతోన్న ‘Kashmir ఫైల్స్’ డైరెక్టర్!

బాలీవుడ్ కాంట్రవర్సీ ‘క్వీన్’ కంగనా ఓ అత్యంత ఆసక్తికర చిత్రానికి సిద్ధమవుతోందా? అవుననే అంటున్నారు బీ-టౌన్ బఫ్స్. ఇంతకీ విషయం ఏంటంటే... 


ప్రస్తుతం దేశంలో మార్మోగిపోతోన్న పేరు... వివేక్ రంజన్ అగ్నిహోత్రి. ఈ డేరింగ్ అండ్ డాషింగ్ ఫిల్మ్ మేకర్‌ ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో అమాంతం క్రేజీగా మారిపోయారు. ఇంతకు ముందు ఆయన ‘తాష్కెంట్ ఫైల్స్’ అనే సినిమా కూడా తీశారు. అప్పుడు ఇంతగా సెన్సేషన్ కానప్పటికీ ‘ద కాశ్మీర్ ఫైల్స్’ మూవీతో బాక్సాఫీస్ బద్ధలుకొట్టేశారు. అంతకంటే ఎక్కువగా రాజకీయ రణరంగానికి కారణమయ్యారు. ‘ద కాశ్మీర్ ఫైల్స్’ 1990ల నాటి కాశ్మీరీ ఉగ్రవాదం గురిరంచిన సినిమా కావటంతో పొలిటికల్‌గా కూడా హీట్ జనరేట్ అయింది. వివేక్ అగ్నిహోత్రి సినిమా కారణంగా ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అండ్ ఆల్ అదర్ పార్టీస్ అన్నట్టుగా వ్యవహారం మారిపోయింది. మరోవైపు సినిమా చూసిన వందలాది మంది ప్రేక్షకులు బాగా ఎమోషనల్ అయిపోయి కంటతడి పెడుతూ భారత్ మాతా కీ జై, వందేమాతరం అంటూ నినదిస్తున్నారు. 


ఒకే ఒక్క హార్డ్ హిట్టింగ్ సినిమాతో దేశం మొత్తాన్ని కదిలించిన వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కంగనాతో కలసి పని చేస్తే? ఈ ఆలోచన అదిరిపోయేలా ఉంది కదా? కాంట్రవర్సీకి కేరాఫ్ అయిన మిస్ రనౌత్ తెర మీద కూడా అద్భుతమే. ఆమె ఏ సినిమా చేసినా మారు మాట్లాడలేకుండా తన పర్ఫామెన్స్‌తో మనల్ని మెస్మరైజ్ చేస్తుంది. అటువంటి బీ-టౌన్ ‘తలైవి’ ప్రస్తుతం ‘ద కాశ్మీర్ ఫైల్స్’ దర్శకనిర్మాతతో చర్చల్లో ఉందట. వారిద్దరూ కలసి ఓ ఎక్స్‌ప్లోజివ్ మూవీ చేయనున్నారని ముంబై టాక్. అయితే, ఇంకా ఫుల్ డిటైల్స్ మాత్రం తెలియటం లేదు. వివేక్ అగ్నిహోత్రి, కంగనా ఇద్దరూ జాతీయ వాద భావజాలం కలిగిన వారే కావటంతో... ఏదో ఒక దేశభక్తి సంబంధమైన, వివాదాస్పదమైన చిత్రం రాబోతోందని మాత్రం అంతా అంచనా వేస్తున్నారు. చూడాలి మరి, ‘ద కాశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ తెరిచి చూపబోయే ‘కంగనా ఫైల్స్’ ఎలాంటి సంచలనానికి కారణం అవుతాయో... 

Updated Date - 2022-03-18T03:32:52+05:30 IST