అలాంటి చెత్త సినిమాలనే కాదు.. ఇలాంటి సినిమాలు చూడండి: Kangana Ranaut

ABN , First Publish Date - 2022-03-23T19:59:31+05:30 IST

మనసులోని ఆలోచనని ఎటువంటి బెరుకు లేకుండా చెప్పే నటీమణుల్లో కంగనా రనౌత్ ఒకరు. దేశవ్యాప్తంగా సంచలనం..

అలాంటి చెత్త సినిమాలనే కాదు.. ఇలాంటి సినిమాలు చూడండి: Kangana Ranaut

మనసులోని ఆలోచనని ఎటువంటి బెరుకు లేకుండా చెప్పే నటీమణుల్లో కంగనా రనౌత్ ఒకరు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’పై ఇటీవలే స్పందించింది. తనకెంతో నచ్చిందని, అందరూ తప్పకుండా చూడాలని కోరింది. తాజాగా సైతం ఈ సినిమా గురించి ఓ సోషల్ మీడియా రిపోర్టర్‌కి నవ్వుతూనే చురకలంటించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ముంబైలోని ఇంటి వద్ద కంగన దగ్గరికి మీడియా వెళ్లింది. దాంతో మీరు ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా చూశారా అని అడిగింది. దానికి వారు చూడలేదని చెప్పారు. దానిపై కంగన మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బావుంది. అందరూ వెళ్లి చూడండి. ఎప్పుడూ చెత్త సినిమాలనే చూస్తారా.. ఇలాంటి మంచి సినిమాలని కూడా చూడండి’ అంటూ నవ్వుతూ చెప్పింది.



Updated Date - 2022-03-23T19:59:31+05:30 IST