Brahmastra: సౌత్ నటులు, దర్శకులను అడుక్కున్నా.. సినిమా డిజాస్టర్

ABN , First Publish Date - 2022-09-10T20:36:18+05:30 IST

బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). బీ టౌన్ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మితమైంది. ధర్మ ప్రొడక్షన్స్,

Brahmastra: సౌత్ నటులు, దర్శకులను అడుక్కున్నా.. సినిమా డిజాస్టర్

బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). బీ టౌన్ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మితమైంది. ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్‌‌స్టార్ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీలో ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించారు. అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల అయింది. ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ఈ సినిమాపై విరుచుపడింది. ‘బ్రహ్మాస్త్ర’ నెగెటివ్ రివ్యూస్‌‌ స్క్రీన్‌షాట్స్‌ తీసి నెటిజన్స్‌తో పంచుకుంది. అబద్ధాలను అమ్మడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించింది.  


అయాన్ ముఖర్జీ తన కెరీర్‌లోనే ఒక మంచి సినిమాను నిర్మించలేదని కంగనా రనౌత్ చెప్పింది. అతడిని జీనియస్ అని పిలిచిన వారిని జైల్లో పెట్టాలని పేర్కొంది.  ‘‘బ్రహ్మాస్త్ర లాంటి సినిమాను నిర్మించినందుకు కరణ్ జోహార్‌ను ప్రశ్నించాలి. అతడికి తన మూవీ స్క్రీఫ్ట్‌లపై తప్ప ప్రతి ఒక్కరి శృంగార జీవితం మీద ఆసక్తి ఉంటుంది. స్టార్స్, రివ్యూస్, ఫేక్ కలెక్షన్ నంబర్స్, టిక్కెట్స్ అన్నింటిని కరణ్ కొనుగోలు చేస్తాడు. ఈ సారి హిందూయిజం, సౌత్ ఇండస్ట్రీని నమ్ముకున్నాడు. దక్షిణాది నటులు, రైటర్స్, దర్శకులను అడుక్కుని సినిమాను ప్రమోట్  చేయించుకున్నాడు. మంచి రైటర్స్, దర్శకులు, నటులు, టాలెంట్ ఉన్న వ్యక్తులను నియమించుకోవడం తప్ప ఈ గ్యాంగ్ ప్రతి ఒక్క పని చేస్తుంది’’ అని కంగన చురకలంటించింది. మూవీ కోసం అయాన్ ముఖర్జీ 12ఏళ్లు పనిచేశాడని, 400రోజులు షూట్ చేశాడని వెల్లడించింది. రూ. 600కోట్లను బూడిదలో పోశాడని స్పష్టం చేసింది. ‘బ్రహ్మాస్త్ర’ లో అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనిరాయ్, షారూఖ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

Updated Date - 2022-09-10T20:36:18+05:30 IST