Kangana Ranaut: ‘లాల్ సింగ్ చడ్డా’ పై నెగెటివ్ ప్రచారానికి ఆమిర్ ఖానే కారణం

ABN , First Publish Date - 2022-08-04T22:01:03+05:30 IST

సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). కుండబద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటుంది. తాజాగా ఆమిర్ ఖాన్ సినిమాపై కామెంట్

Kangana Ranaut: ‘లాల్ సింగ్ చడ్డా’ పై నెగెటివ్ ప్రచారానికి ఆమిర్ ఖానే కారణం

సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). కుండబద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటుంది. తాజాగా ఆమిర్ ఖాన్ సినిమాపై కామెంట్ చేసింది. ఆమిర్ గతంలో భారత్‌లో అసహనం పెరిగిపోయిందని చెప్పాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ‘బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా’ అనే టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ అంశంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన తాజాగా స్పందించింది.    


‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha)పై జరుగుతున్న నెగెటివ్ ప్రచారానికి ఆమిర్ ఖానే కారణమని కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ‘‘..‘లాల్ సింగ్ చడ్డా’ పై ఆమిర్ ఖాన్ నేర్పుగా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని నేను అనుకుంటాను. ఈ ఏడాది థియేటర్స్‌లో ఏ హిందీ సినిమా వసూళ్లను రాబట్టలేదు. లోకల్ ప్లేవర్‌తో వచ్చిన దక్షిణాది చిత్రాలు మాత్రమే కలెక్షన్స్‌ను కొల్లగొట్టాయి. ఎట్టి పరిస్థితుల్లోను హాలీవుడ్ రీమేక్ కూడా హిట్ కాదు. హిందీ చిత్రాల నిర్మాతలు ప్రేక్షకుల అభిరుచుల్ని అర్థం చేసుకోవాలి. ఆమిర్ ఖాన్ గారు హిందూ ఫోబియాతో ‘పీకే’ లో నటించారు. సినీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. అయినప్పటికీ భారత్‌లో అసహనం పెరిగిపోయిందన్నారు. మతం లేదా సిద్ధాంతాలపై సినిమాలు నిర్మించడం ఆపేయండి’’ అని కంగన చెప్పింది. ‘బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా’ సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో ఆమిర్ ఖన్ గతంలోనే స్పందించాడు. ‘‘నాకు భారత్ అంటే ఇష్టం లేదని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, అది అసత్యం. సోషల్ మీడియాలో నా సినిమాను బాయ్‌కాట్ చేయమనడం విచారకరం’’ అని ఆమిర్ పేర్కొన్నాడు. అమెరికన్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ (Forrest Gump)కు రీమేక్ గా ‘లాల్ సింగ్ చడ్డా’ రూపొందింది. ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించింది. అక్కినేని నాగచైతన్య కీలక పాత్ర పోషించాడు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది.  

Updated Date - 2022-08-04T22:01:03+05:30 IST