Kangana Ranaut: నేను గాంధీవాదిని కాను.. నేతాజీవాదిని.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఫైర్‌బ్రాండ్

ABN , First Publish Date - 2022-09-09T17:02:01+05:30 IST

బాలీవుడ్‌(Bollywood)లో మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఒకరు. ఎటువంటి సపోర్టు లేకుండా..

Kangana Ranaut: నేను గాంధీవాదిని కాను.. నేతాజీవాదిని.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఫైర్‌బ్రాండ్

బాలీవుడ్‌(Bollywood)లో మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఒకరు. ఎటువంటి సపోర్టు లేకుండా బీటౌన్‌లోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు పొందింది. అంతేకాకుండా.. వరుసగా లేడీ ఓరియెంటెడ్, ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ కెరీర్‌లో దూసుకెళుతోంది. అయితే.. ఈ బ్యూటీ ఏ విషయం గురించైనా ఎటువంటి మొహమాటం లేకుండా మాట్లాడుతుందనే విషయం తెలిసిందే. తాజాగా సైతం కంగనా రనౌత్ మరోసారి గాంధీజీ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది.


ఢిల్లీలో జరిగిన పునరుద్ధరించిన రాజ్‌పథ్ కర్తవ్య పథ్ ప్రారంభోత్సవానికి కంగనా హాజరయ్యారు. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ‘నేను గాంధీవాదిని కాదు.. నేతాజీ (Netaji) వాదిని. అందుకే చాలామంది నా మాటల వల్ల ఇబ్బంది పడుతుంటారు. ప్రతి ఒక్కరికి వారి సొంత ఆలోచనా విధానం ఉంటుంది. ఈ కారణంగా.. నేతాజీ, సావర్కర్ వంటి అనేకమంది విప్లవకారులు చేసిన పోరాటానికి సరైన గుర్తింపు రాలేదని అనుకుంటున్నాను. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమని గాంధీ చెప్పారు. అందుకే నిరాహారదీక్ష, దండి కవాతు చేసి స్వాతంత్ర్యం సాధించుకున్నామని అందరూ చెబుతుంటారు. అది నిజం కాదు.


లక్షలాది మంది ప్రజలు ప్రాణం త్యాగం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనడం ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యం  తీసుకురావాలని నేతాజీ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. దానికోసం ఆయన సైన్యాన్ని కూడా రెడీ చేశాడు. అందువల్ల బ్రిటిష్ వారిపై ఒత్తిడి పెరిగింది. దాని వల్లే దేశానికి సాధించగలిగారు’ అని చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-09-09T17:02:01+05:30 IST