Kangana : ఆకాశాన్ని ఏలేందుకు... అక్టోబర్ నుంచీ సిద్ధం!

ABN , First Publish Date - 2021-12-08T03:31:05+05:30 IST

తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటుంది ‘క్వీన్’ ఆప్ బాలీవుడ్ కంగనా. అయితే, లెటెస్ట్‌గా ఆమె ఎలాంటి కాంట్రవర్సీకి ఛాన్స్ లేని ఓ కూల్ న్యూస్ షేర్ చేసింది...

Kangana : ఆకాశాన్ని ఏలేందుకు... అక్టోబర్ నుంచీ సిద్ధం!

తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటుంది ‘క్వీన్’ ఆప్ బాలీవుడ్ కంగనా. అయితే, లెటెస్ట్‌గా ఆమె ఎలాంటి కాంట్రవర్సీకి ఛాన్స్ లేని ఓ కూల్ న్యూస్ షేర్ చేసింది. కంగనా నటించిన బయోపిక్ మూవీ ‘తేజస్’ ఎప్పట్నుంచో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే కొన్ని పిక్స్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, ‘తేజస్’ సినిమా అక్టోబర్ 5, 2022న థియేటర్స్‌కు వచ్చేస్తోందని కంగనా అధికారికంగా ఇప్పుడు ప్రకటించింది!


‘తేజస్’ సినిమాలో... ఎయిర్ ఫోర్స్ పైలట్ ‘తేజస్ గిల్‘ పాత్రలో కనిపించనుంది కంగనా రనౌత్. ‘‘ఆకాశాన్ని ఏలాలని నిర్ణయించుకున్న ఓ స్త్రీ తాలూకూ ప్రేరణాత్మకమైన కథతో వచ్చేస్తోంది ‘తేజస్’. ఇది భారత వైమానిక దళ విజయగీతిక!’’ అంటూ కంగనా ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది! చూడాలి మరి, ‘ఆకాశాన్ని ఏలేస్తా’నంటూ అక్టోబర్‌లో వస్తోన్న ‘మణికర్ణిక’ బాక్సాఫీస్‌ని ఎలా స్వారీ చేస్తుందో!   

Updated Date - 2021-12-08T03:31:05+05:30 IST