హృతిక్ రోషన్‌పై మరోసారి Kangana Ranaut విమర్శలు.. ఆరు వేళ్ల మనిషి అంటూ..

ABN , First Publish Date - 2022-02-28T21:21:11+05:30 IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముక్కుసూటితనం గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో విషయాలపై తన అభిప్రాయాన్ని ఎలాంటి బెదురు లేకుండా తెలిపే ఈ నటి వివాదాల్లో..

హృతిక్ రోషన్‌పై మరోసారి Kangana Ranaut విమర్శలు.. ఆరు వేళ్ల మనిషి అంటూ..

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముక్కుసూటితనం గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో విషయాలపై తన అభిప్రాయాన్ని ఎలాంటి బెదురు లేకుండా తెలిపే ఈ నటి వివాదాల్లో సైతం ఇరుక్కుంటూ ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్‌పైన, అక్కడ వారసత్వ నటులపై అవకాశం చిక్కినప్పుడల్లా ఏదో విమర్శలు చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ తార తన మాజీ ప్రియుడు, స్టార్ హీరో హృతిక్ రోషన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది.


కంగన ‘లాకప్’ అనే రియాలిటీ షోని హోస్ట్‌ చేస్తోంది. అందులో.. ఆయా సందర్భాల్లో వివాదాల్లో ఇరుక్కున 16 మంది కంటెస్టెంట్స్‌గా పాల్గొంటున్నారు. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ రియాలిటీ షో మొదటి ఎపిసోడ్ ఫిబ్రవరి 27న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ అల్ట్ బాలాజీ, ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌లో ప్రసారం అయ్యింది.


ప్రీమియర్ షోలో ఆమె మాట్లాడుతూ..‘ఆమె షో ద్వారా నిజస్వరూపాలు బయటపడతాయేమోనని చాలా మంది ప్రముఖులు భయపడుతున్నారు. అయిదేళ్లుగా అసలే పట్టించుకోని అతడి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఆమె ఓ విషయం చెప్పి అందరి దృష్టినీ ఆకర్షించింది. అందరూ అయిదువేళ్లను మడతపెట్టి చేతులు కలుపుతున్నారు. అందుకే ఆరు వేళ్లున్న వ్యక్తికి గొంతెండుకపోతోంది.’ అని చెప్పుకొచ్చింది.


అయితే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌‌తో కంగన ప్రేమాయణం గురించి, ఆయన చేతికి ఆరు వేళ్లు ఉంటాయని అందరికీ తెలిసిందే. దీంతో షోలో ఆయన్ని ఉద్దేశించే కంగన ఆ వ్యాఖ్యలు చేసుంటుందని అందరూ చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ విషయమై పోస్టులు పెడుతున్నారు. కాగా.. గతంలో సైతం తన మెయిల్‌ని హ్యాక్ చేయించడంటూ ఈ క్రిష్ హీరోపై కంగన సైబర్ క్రైమ్‌కి కంప్లైంట్ కూడా చేసింది. అంతేకాకుండా అవకాశం వచ్చినప్పుడల్లా ఆయనపై విమర్శలు చేసింది.

Updated Date - 2022-02-28T21:21:11+05:30 IST