పెళ్లి బంధాన్నే కాపాడుకోలేకపోయావంటూ నెటిజన్ కామెంట్.. నటి స్ట్రాంగ్ కౌంటర్

ABN , First Publish Date - 2021-12-09T16:53:45+05:30 IST

సోషల్ మీడియా వినియోగం పెరిగిన ఈ తరుణంలో సెలబ్రిటీలను విమర్శించడం మామూలైపోయింది. అది ఈ కాలంలో మరి ఎక్కువైపోయింది. తాజాగా అలాంటి ట్రోలింగ్‌కి గురైంది నటి కామ్యా పంజాబీ.

పెళ్లి బంధాన్నే కాపాడుకోలేకపోయావంటూ నెటిజన్ కామెంట్.. నటి స్ట్రాంగ్ కౌంటర్

సోషల్ మీడియా వినియోగం పెరిగిన ఈ తరుణంలో సెలబ్రిటీలను విమర్శించడం మామూలైపోయింది. అది ఈ కాలంలో మరి ఎక్కువైపోయింది. తాజాగా అలాంటి ట్రోలింగ్‌కి గురైంది నటి కామ్యా పంజాబీ.


ఈ నటి, బిజినెస్‌మెన్ బంటీ నెగీ పెళ్లి చేసుకున్న 10 సంవత్సరాల తర్వాత 2013లో విడాకులు తీసుకుంది. వీరిద్దరికి ఆరా అనే కూతురు ఉంది. కాగా డైవోర్స్ అయిన దాదాపు 7 ఏళ్ల తర్వాత ఈమె గతేడాది శలాబ్ దంగ్‌ని పెళ్లి చేసుకుంది.


అయితే తాజాగా ఈమె సోషల్ మీడియాలో మహిళ ఎంపవర్‌మెంట్ గురించి మాట్లాడింది. దీనిపై.. ‘నువ్వు నీ మొదటి పెళ్లి బంధాన్ని కాపాడుకోలేదు. విడాకులు తీసుకొని మరో పెళ్లి చేసుకున్నావు. అదే మీకు హద్దు’ అంటూ ట్రోల్ చేశాడు.


దీనిపై స్పందించిన కామ్యా.. ‘నేను సంతోషంగా ఉండకూడదా? విడాకుల తర్వాత మహిళ చనిపోవాలా? డైవోర్స్ తర్వాత జీవితం ఉంటుంది. నీలాంటి ఆలోచన విధానం ఉన్న వ్యక్తుల గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. అలాగే చేస్తున్నారు. నన్ను బలహీనురాలని అనుకోకు. నేను ఫైట్ చేయగలన’ని స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చింది.


అంతేకాకుండా ఓ ఇంటర్వ్యూలో కామ్యా.. ‘విడాకుల తర్వాత సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేశారు. మా కుటుంబాల్లో డైవోర్స్ అనేవి ఉండవు. అది ఎంతో బాధకరమైన విషయమ’ని తన బాధను తెలిపింది.



Updated Date - 2021-12-09T16:53:45+05:30 IST