‘ఐసరి వేలన్‌’ విగ్రహావిష్కరణలో కమల్‌ హాసన్‌

ABN , First Publish Date - 2022-05-15T21:27:15+05:30 IST

తనలో ఇప్పటికీ ఒక డ్యాన్స్‌ అసిస్టెంట్‌ అనే భావన ఉందని, కానీ కొందరు తనను ఓ పెద్ద నటుడిని చేశారని విశ్వనటుడు కమల్‌ హాసన్‌ అన్నారు. దివంగత నటుడు, వేల్స్‌ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు ఐసరి వేలన్‌ 35వ స్మారకదినోత్సవ వేడుకలు శనివారం స్థానిక రాజా అన్నామలైపురంలోని డాక్టర్‌ ఎంజీఆర్‌ జానకి కాలేజీలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమల్‌ హాసన్‌ ఐసరి వేలన్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

‘ఐసరి వేలన్‌’ విగ్రహావిష్కరణలో కమల్‌ హాసన్‌

తనలో ఇప్పటికీ ఒక డ్యాన్స్‌ అసిస్టెంట్‌ అనే భావన ఉందని, కానీ కొందరు తనను ఓ పెద్ద నటుడిని చేశారని విశ్వనటుడు కమల్‌ హాసన్‌ (Kamahasan) అన్నారు. దివంగత నటుడు, వేల్స్‌ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు ఐసరి వేలన్‌ (Isari velan) 35వ స్మారకదినోత్సవ వేడుకలు శనివారం స్థానిక రాజా అన్నామలైపురంలోని డాక్టర్‌ ఎంజీఆర్‌ జానకి కాలేజీలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమల్‌ హాసన్‌ ఐసరి వేలన్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఆడిటోరియం ఉన్న ప్రాంతంలోనే గతంలో ఎంజీఆర్‌ (MGR) చిత్రానికి డ్యాన్స్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తాను ఒక డ్యాన్స్‌ అసిస్టెంట్‌ అనే భావనతోనే ఉన్నానని చెప్పారు. కానీ కొందరు ఈ మధ్యకాలంలో సినిమా వాల్‌పోస్టర్ల ద్వారా పెద్ద నటుడిని చేశారన్నారు. 


ఐసరి వేలన్‌ తనయుడు, వేల్స్‌ విశ్వవిద్యాయలం ఛాన్సలర్‌ ఐసరి గణేష్‌ (Isari ganesh) తన తండ్రి చూపిన బాటలోనే నడుస్తూ ప్రజాసేవ చేస్తున్నారు. ఇదే విధంగా ముందుకు సాగాలని కమల్‌ హసన్‌ (Kamalhasan) కోరారు. ఈ కార్యక్రమంలో అనేక మందికి వైద్య బీమా కార్డులతో వివిధ సంక్షేమ ఫలాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్‌ నటీమణులు జయచిత్ర, లత, రాధిక, పూర్ణిమ భాగ్యరాజ్‌, హీరో ప్రభు, ప్రశాంత్‌, దర్శకుడు ఆర్‌.కె.సెల్వమణి, హాస్య నటుడు గౌండర్‌మణి, నటుడు చిన్నిజయంత్‌, ఎస్వీశేఖర్‌, నిర్మాత కె.రాజన్‌ తదితరులు పాల్గొన్నారు. ఐసరి వేలన్‌ కుటుంబ సభ్యులతో పాటు అనేక మంది లబ్ధిదారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు.

Updated Date - 2022-05-15T21:27:15+05:30 IST