Kamal Haasan ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుందా..?

ABN , First Publish Date - 2022-07-03T20:32:15+05:30 IST

స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) నాలుగేళ్ల తర్వాత బంపర్ హిట్ కొట్టాడు. ‘విక్రమ్’ (Vikram) తో కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి(Vijay Sethupathi), ఫహద్

Kamal Haasan ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుందా..?

స్టార్ హీరో  కమల్ హాసన్ (Kamal Haasan) నాలుగేళ్ల తర్వాత బంపర్ హిట్ కొట్టాడు. ‘విక్రమ్’ (Vikram) తో కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి(Vijay Sethupathi), ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil)కీలక పాత్రలు పోషించారు. లోకేశ్ కనకరాజ్(Lokesh Kanagaraj)  దర్శకత్వం వహించాడు. అనిరుధ్ సంగీతం అందించాడు. ‘విక్రమ్’ వరల్డ్ వైడ్‌గా దాదాపుగా రూ. 400కోట్ల భారీ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తుండగానే అతడికి షాక్ తగిలింది. 


కమల్ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అతడికి నోటీసులు పంపించిందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. నోటీసులు పంపిచినప్పటికీ ప్రాంగంణంలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి అభ్యర్థించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలో రెండో దశ మెట్రోను నిర్మిస్తున్నారు. అల్వార్ పేట స్టేషన్ కమల్ నివాసం నుంచే వెళుతుంది. ఆ భవనంలో 170చదరపు అడుగులు స్టేషన్ నిర్మాణం కోసం కావాలి. అందులో భాగంగానే ప్రభుత్వం నోటీసులు పంపిచినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2022-07-03T20:32:15+05:30 IST