Vikram ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. Kamal Haasan సినిమా ఎలా ఉందంటే..!

ABN , First Publish Date - 2022-05-31T19:38:30+05:30 IST

చాలా గ్యాప్ తర్వాత యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌ తాజాగా నటించిన చిత్రం ‘విక్రమ్’. ఈ మూవీలో ఆయన రా (RAW) ఏజెంట్ అరుణ్ కుమార్ విక్రమ్

Vikram ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. Kamal Haasan సినిమా ఎలా ఉందంటే..!

చాలా గ్యాప్ తర్వాత యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌ తాజాగా నటించిన చిత్రం ‘విక్రమ్’. ఈ మూవీలో ఆయన రా (RAW) ఏజెంట్ అరుణ్ కుమార్ విక్రమ్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో తమిళ, మలయాళ స్టార్స్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహాద్ ఫాజిల్‌ (Fahadh Faasil) ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా.. మరో తమిళ హీరో సూర్య (Surya) అతిథి పాత్రలో మెరవనున్నారు. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్‌ 3న తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మంచి రెస్పాన్స్‌నే అందుకుంది. కాగా.. విడుదలకి ముందే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.


కమల్ సినిమాని చూసిన ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యులు ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్‌లో.. ‘కోలివుడ్‌లోని మంచి యాక్షన్ థ్రిల్లర్స్‌లో ఈ సినిమా ఒకటి. సినిమాకి స్టార్ కమల్ హాసనే’ అంటూ రాసుకొచ్చారు. అంతేకాకుండా ఆయన ఇన్‌స్టా స్టోరీలో సైతం ఈ మూవీ రివ్యూని షేర్ చేశారు. అందులో.. ‘కోలీవుడ్‌లోని బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్స్‌లో విక్రమ్ సినిమా ఒకటి. హై ఓల్టేజ్ యాక్షన్. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ఇరగదీశారు. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. ఓ సర్‌ప్రైజ్ హిట్ రాబోతోంది. రేటింగ్ 3.5’ అంటూ రాసుకొచ్చారు. కాగా.. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఆర్ మహేంద్రన్, కమల్ హాసన్ నిర్మించారు.





Updated Date - 2022-05-31T19:38:30+05:30 IST