Vikram Twitter review: కమల్ హాసన్ మూవీ ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2022-06-03T15:28:35+05:30 IST

చాలా గ్యాప్ తర్వాత తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన చిత్రం ‘విక్రమ్’. ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం...

Vikram Twitter review: కమల్ హాసన్ మూవీ ఎలా ఉందంటే..

చాలా గ్యాప్ తర్వాత తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన చిత్రం ‘విక్రమ్’. ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మరో తమిళ నటుడు విజయ్ సేతుపతి, మలయాళీ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటించగా.. మరో తమిళ స్టార్ సూర్య అతిథి పాత్రలో మెరిశారు. అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఖైదీ, మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కమల్‌తో లోకేశ్ చేస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


అనంతరం విడుదలైన టీజర్, ట్రైలర్స్, పాటలు మంచి రెస్పాన్స్ అందుకొని ఆ అంచనాలను ఇంకా పెంచేశాయి. అనిరుధ్ మ్యూజిక్ అయితే ఓ రేంజ్ ఆకట్టుకుంది. ఇన్ని అంచనాల నడుమ జూన్ 3న తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం 200 కోట్లకి పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం గమనార్హం. ఈ తరుణంలో పలు నగరాల్లో ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్‌లో సినిమా ఎలా ఉందో చెప్పేస్తున్నారు.


దర్శకుడు లోకేశ్ మరో మాస్టర్ పీస్‌ని రూపొందించారని, యాక్షన్ అవతార్‌లో కమల్ హాసన్ అదిరిపోయే ఫర్ఫామెన్స్ ఇచ్చారని చెబుతున్నారు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ అయితే తమ నటనతో సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారని అంటున్నారు. సూర్య కనిపించింది కొద్దిసేపే అయినప్పటికీ సినిమాలో తన మార్క్ చూపించారట. సినిమా చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ వచ్చాయని పలువురు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. యాక్షన్ సీన్స్ అయితే మరోస్థాయిలో ఉన్నాయని అంటున్నారు. దర్శకుడు లోకేశ్ తన మార్క్ స్క్రీన్‌ ప్లేతో సినిమా స్థాయిని పెంచేశారని చెబుతున్నారు.



















Updated Date - 2022-06-03T15:28:35+05:30 IST