Kamal Haasan : పదినిమిషాల డైలాగ్‌తో సరికొత్త రికార్డ్..

ABN , First Publish Date - 2022-09-15T17:41:31+05:30 IST

లోకనాయకుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) ‘విక్రమ్’ (Vikram) మూవీతో మళ్లీ సూపర్ ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. చాన్నాళ్ళ తర్వాత సరైన హిట్ పడడంతో.. తదుపరి చిత్రాల్ని మరింత స్పీడప్ చేస్తున్నారు.

Kamal Haasan : పదినిమిషాల డైలాగ్‌తో సరికొత్త రికార్డ్..

లోకనాయకుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) ‘విక్రమ్’ (Vikram) మూవీతో మళ్లీ సూపర్ ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. చాన్నాళ్ళ తర్వాత సరైన హిట్ పడడంతో.. తదుపరి చిత్రాల్ని మరింత స్పీడప్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘ఇండియన్ 2’ (Indian 2) మూవీ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. గతంలో సూపర్ హిట్టైన ‘ఇండియన్’ (Indian) చిత్రానికి సీక్వెల్‌గా రానుండడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడో మొదలుపెట్టిన షూటింగ్‌కు కొన్ని అవాంతరాలు ఎదురవడంతో కొంత కాలం షూటింగ్ ఆగిపోయింది. అన్ని సమస్యలు పరిష్కారం అయిన తర్వాత తిరిగి పట్టాలెక్కింది. కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) కథానాయికగా నటిస్తుండగా.. రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preehsingh) కీలక పాత్ర పోషిస్తోంది. ఇంకా బాబీ సింహ, సిద్ధార్ధ్, ప్రియా భవానీ శంకర్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అసలు విషయానికొస్తే ఈ సినిమాలో కమల్ హాసన్ డైలాగ్స్ పరంగా ఒక కొత్త రికార్డ్ ను నెలకొల్పినట్టు సమాచారం.


‘ఇండియన్ 2’ మూవీలో కమల్ పదినిమిషాల డైలాగ్ చెప్పారట. అది సింగిల్ షాట్‌లో ఉంటుంది. ఇందులో విశేషమేంటి? అనుకుంటున్నారా? ఆ ఒకేఒక్క డైలాగ్‌ను మొత్తం 14 భాషల్లో చెప్పారట. ఆ సీన్‌తో సెట్లో ఉన్నవారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారట కమల్. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆయన వెర్సటాలిటీ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి సన్నివేశానికయినా.. తన అద్భుతమైన నటనతో జీవం పోస్తారు కమల్. మొదటి భాగంలో కమల్ విశ్వరూపాన్ని సగమే చూశారు, రెండో భాగంలో అంతకు మించిన స్థాయిలో ఆయన పెర్ఫార్మెన్స్ చూస్తారని మేకర్స్ అంటున్నారు. 


మొదటి భాగం క్లైమాక్స్‌లో సేనాపతి బతికే ఉన్నట్టు హింటిచ్చాడు దర్శకుడు శంకర్. ఫారెన్‌లో ఎక్కడో రివీలైన ఆ పాత్ర... నా అవసరం పడితే మళ్ళీ తప్పుకుండా వస్తానని డైలాగ్ కూడా చెబుతాడు. ఆయన మళ్లీ అవినీతిపై పోరాటం చేసే రెండో మిషన్‌గా ‘ఇండియన్ 2’ రాబోతోందని అర్ధమవుతోంది. మొదటి భాగంలో నటించిన నెడుముడి వేణు (Nedumudi Venu), వివేక్ (Vivek) చనిపోవడంతో వారి స్థానంలో వేరే నటుల్ని ఎంపిక చేశాడు శంకర్. మరి కమల్ పలికిన 14 భాషల సింగిల్ టేక్ డైలాగ్ సినిమాలో ఏ స్థాయిలో పేలుతుందో చూడాలి. 

Updated Date - 2022-09-15T17:41:31+05:30 IST