Kamal Hassan: ‘పొన్నియిన్ సెల్వన్’లో ఆ పాత్ర కోసం రజనీతో పోటీ పడ్డా..

ABN , First Publish Date - 2022-09-07T19:58:22+05:30 IST

విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్యారాయ్ ముఖ్య పాత్రధారులుగా తెరకెక్కిస్తున్నట్లు మణిరత్నం ప్రకటించిన్నప్పటి నుంచి..

Kamal Hassan: ‘పొన్నియిన్ సెల్వన్’లో ఆ పాత్ర కోసం రజనీతో పోటీ పడ్డా..

విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్యారాయ్ ముఖ్య పాత్రధారులుగా తెరకెక్కిస్తున్నట్లు మణిరత్నం ప్రకటించిన్నప్పటి నుంచి.. ‘పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan)’ గురించి ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. అయితే నిజానికి ఈ సినిమాని తీయాలని 30 ఏళ్ల క్రితమే ఈ లెజెండరీ డైరెక్టర్ ప్లాన్ చేశాడంట. లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan), సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని 1989లోనే మణిరత్నం(Mani Ratnam) స్ర్కీప్ట్ రెడీ చేసుకున్నారు. కానీ పలు కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసనే తాజాగా తెలియజేశాడు.


‘పొన్నియిన్ సెల్వన్’ ట్రైలర్, ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని తాజాగా చెన్నైలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కమల్ హాసన్, రజనీకాంత్‌తోపాటు ఇతర కోలీవుడ్ ప్రముఖుల అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా గురించి మణిరత్నం నాకు చెప్పారు. అందులో వంతీయతేవన్‌గా రజనీ చేస్తే బావుంటుందని నాకు శివాజీ సర్ చెప్పారు. నేను ఆ పాత్ర చేయాలనుకుంటున్నట్లు వారితో చెప్పాను. కానీ.. వారు మాత్రం నన్ను అరుణ్‌మోళి వర్మన్‌ పాత్ర చేయమని పట్టుబట్టారు. అలా ఆ పాత్రకోసం రజనీతో పోటీ పడ్డాను’ అని చెప్పుకొచ్చాడు. అయితే.. ప్రస్తుతం ‘పొన్నియిన్ సెల్వన్‌’లో కార్తీ వంతీయతేవన్ పాత్రను పోషిస్తున్నాడు. అది ఒక గూఢచారి, సాహసికుడి పాత్ర. అలాగే.. అరుణ్‌మోళి వర్మన్‌ పాత్రలో జయం రవి నటిస్తున్నాడు. అది దూరదృష్టి గల యువరాజు, వాస్తుశిల్పి పాత్ర.


కాగా.. ఈ మూవీ గురించి రజనీ కాంత్ మాట్లాడుతూ.. ‘నేను ఎలాగైనా ఈ సినిమాలో భాగం కావాలనుకున్నాను. అందుకే నేను పెరియ పజువెట్టరైయర్ పాత్రను చేయనా అని నేను మణి సర్‌ని అడిగాను. ఆ పాత్ర చేస్తే నా అభిమానులు సంతోషపడరని.. ఆయన నా ఆఫర్‌ని తిరస్కరించాడు. మరేవరైనా అయితే ఆ అవకాశాన్ని వదులుకొనే వారు కాదు. కానీ మణి సర్ వద్దు అన్నారు. అదే ఆయనలో ఉన్న ప్రత్యేకత’ అని తెలిపాడు.

Updated Date - 2022-09-07T19:58:22+05:30 IST