Indian 2: రెండేళ్ల తర్వాత సెట్లోకి ఎంట్రీ ఇచ్చిన కమల్

ABN , First Publish Date - 2022-09-22T23:15:18+05:30 IST

శంకర్ (Shankar) రూపొందించిన ప్రతిష్ఠాత్మక సినిమా ‘ఇండియన్’ (Indian). కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా నటించాడు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే యోధునిగా కనిపించారు. 1996‌లో

Indian 2: రెండేళ్ల తర్వాత సెట్లోకి ఎంట్రీ ఇచ్చిన కమల్

శంకర్ (Shankar) రూపొందించిన ప్రతిష్ఠాత్మక సినిమా ‘ఇండియన్’ (Indian). కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా నటించాడు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే యోధునిగా కనిపించారు. 1996‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. శంకర్ ఈ సినిమాకు సీక్వెల్‌కు తీస్తున్నట్టు ప్రకటించాడు. ‘ఇండియన్ 2’ (Indian 2) టైటిల్‌తో రూపొందిస్తున్నామన్నాడు. కొన్నేళ్ల క్రితమే ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. లైకా ప్రొడక్షన్స్ మూవీని నిర్మిస్తుంది. బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఈ ప్రాజెక్టు అటకెక్కింది. కానీ, సమస్యలన్ని పరిష్కారమవ్వడంతో కొన్ని రోజుల క్రితమే ‘ఇండియన్ 2’ తిరిగి పట్టాలెక్కింది. తాజాగా ఈ సినిమా సెట్లోకి కమల్ హాసన్ అడుగు పెట్టాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  


కమల్ ‘ఇండియన్’ లో సేనాపతి పాత్రలో కనిపించాడు. ‘ఇండియన్ 2’ లోను అదే రోల్‌లో కనిపించనున్నాడు. కమల్ సెప్టెంబర్ 22న ఇండియన్ 2 సెట్లో జాయిన్ అయ్యాడు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ పిక్స్‌లో శంకర్, కమల్ చర్చించుకుంటున్నారు. ‘ఇండియన్-2’ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా కోసం అందాల చందమామ హార్స్ రైడింగ్ నేర్చుకొంటుంది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఇండియన్ 2’ లో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండేళ్ల క్రితం 2020, ఫిబ్రవరిలో ‘ఇండియన్ 2’ సెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మరణించారు. 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఘటన తర్వాత ఇండియన్ 2 సెట్లోకి కమల్ ఎప్పుడు అడుగుపెట్టలేదు.     




Updated Date - 2022-09-22T23:15:18+05:30 IST