ఎన్టీఆర్ (NTR) నెస్ట్ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకొస్తుందా..ఆ మూవీ అప్‌డేట్స్ ఎప్పుడు వస్తాయని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి భారీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన నెక్స్ట్ సినిమాను శంకర్ (Shankar) దర్శకత్వంలో మొదలుపెట్టి చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అలాగే, గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanuri) దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ (UV Creations) నిర్మించనున్న ప్రాజెక్ట్‌ను కూడా చరణ్ ఇప్పటికే ప్రకటించాడు. కానీ, ఇంకా తారక్ (Tarak) కొత్త ప్రాజెక్ట్ మొదలవకపోవడంతో అభిమానుకు కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు.
తారక్ తన 30వ సినిమాను కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమాను సెట్స్ మీదకి త్వరలో తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పాటికే మొదలవ్వాల్సిన ఎన్టీఆర్ 30ని..ఆచార్య ఫలితంతో మరోసారి పక్కాగా స్క్రిప్ట్ చూసుకొని ప్రారంభించాలని కొరటాల కాస్త సమయం తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా కూడా మొదలవ్వాల్సి ఉంది. మైత్రీ మూవి మేకర్స్ ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ గురించి కన్‌ఫర్మ్ చేశారు కూడా.
అయితే, తాజా సమాచారం మేరకు ఇందులో ఓ కీలకమైన పాత్ర ఉండగా, అందుకోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan)ను ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది. అసలు కమల్ - తారక్ కాంబినేషన్ అది కూడా ప్రశాంత్ నీల్ వంటి దర్శకుడు అనే ఆలోచనే అభిమానుల్లో టన్నులకొద్దీ ఉత్సాహాన్నిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ, బిగ్ స్క్రీన్ మీద కమల్ హాసన్ - తారక్ కనిపిస్తే మాత్రం ఆ ఫీల్ మాటల్లో చెప్పడం ఎవరివల్లా కాదు. నిజంగానే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 (NTR 31) కోసం కమల్‌ను సంప్రదించారా..ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..? అనేది తెలియాల్సి ఉంది. అఫీషియల్‌గా ఈ కాంబో కన్‌ఫర్మ్ అయితే మాత్రం అంచనాలు తారా స్థాయిలోనే నెలకొంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.