Chiranjeevi: విశ్వనాయకుడికి మరింత బలం

ABN , First Publish Date - 2022-06-12T15:18:17+05:30 IST

తన చిరకాల మిత్రుడు కమల్‌హాసన్‌ను(Kamal hassan) చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. ‘విక్రమ్‌’ (Vikram) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన శనివారం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ కోసం చిత్రబృందంతో హైదరాబాద్‌ వచ్చారు. కార్యక్రమం అనంతరం కమల్‌హాసన్‌ చిరు ఇంటికి చేరుకున్నారు. విక్రమ్‌ సినిమాతో అలరించిన ఆయన్ను చిరంజీవి సన్మానించారు.

Chiranjeevi: విశ్వనాయకుడికి మరింత బలం

తన చిరకాల మిత్రుడు కమల్‌హాసన్‌ను(Kamal hassan) చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. ‘విక్రమ్‌’ (Vikram) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన శనివారం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ కోసం చిత్రబృందంతో హైదరాబాద్‌ వచ్చారు. కార్యక్రమం అనంతరం కమల్‌హాసన్‌ చిరు ఇంటికి చేరుకున్నారు. విక్రమ్‌ సినిమాతో అలరించిన ఆయన్ను చిరంజీవి సన్మానించారు. బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌, దర్శకుడు లోకేశ్‌ కనకరాజు కూడా ఈ సందడిలో భాగమయ్యారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడిని చిరంజీవి అభినందించారు. ఈ ఫొటోలను చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘విక్రమ్‌’ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నా ప్రియ మిత్రుడిని శనివారం రాత్రి మా ఇంట్లో ఆత్మీయంగా కలవడం చాలా ఆనందంగా, గౌరవంగా భావిస్తున్నా. ఈ వేడుకలో మరో ప్రియమైన స్నేహితుడు సల్మాన్‌ఖాన్‌ కూడా ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా సక్సెస్‌ నా మిత్రుడు కమల్‌కు మరింత బలానిచ్చింది’’ అని చిరంజీవి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. (Kamal hassan visits Chiranjeevi)



Updated Date - 2022-06-12T15:18:17+05:30 IST