విభిన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కోలీవుడ్ నటుడు దళపతి విజయ్(Thalapathy Vijay). జూన్ 22న పుట్టిన రోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అనేక మంది సెలబ్రిటీలు స్టార్ హీరోకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో విజయ్ అభిమానులు కూడా ఆయన బర్త్ డేను సెలబ్రేట్ చేశారు. విశ్వ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan)కూడా దళపతిని సర్ప్రైజ్లో ముంచెత్తారు.
కమల్ హాసన్, విజయ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరు నటులు కూడా వీలైనప్పుడల్లా ఒకరిని మరొకరిని పొగుడుతుంటారు. విజయ్ బర్త్ డే సందర్భంగా కమల్ హాసన్ ఫోన్ చేశారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. దీంతో ఇద్దరు నటుల అభిమానులు కూడా సంతోషంలో మునిగిపోయారు. విజయ్‌తో కలసి సినిమా చేసేందుకు కూడా కమల్ ఆసక్తి చూపిస్తున్నారు. కమల్ ఇదే విషయాన్ని తెలపగా భవిష్యత్తులో తప్పకుండా చేద్దామని దళపతి మాటిచ్చాడని కోలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. మరి ఈ ఇద్దరు నటులు వెండితెరపై కనిపిస్తారో లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ప్రస్తుతం కమల్ హాసన్ సంతోషంలో మునిగితేలుతున్నారు. ఆయన నటించిన ‘విక్రమ్’ (Vikram) సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అత్యధిక వసూళ్లను కొల్లగొట్టిన చిత్రంగా నిలిచింది. ఇక విజయ్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘వారసుడు’ (varasudu) లో నటిస్తన్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.