బిగ్‌బాస్: కమల్ స్థానంలో ఒక్కరు కాదు.. ముగ్గురు

ABN , First Publish Date - 2021-11-24T23:38:01+05:30 IST

విశ్వనటుడు కమల్‌హాసన్‌కు కరోనా వైరస్‌ సోకడంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన హోస్ట్‌గా ప్రసారమయ్యే రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 5 తమిళ కార్యక్రమానికి ఇపుడు తాత్కాలికంగా కొత్త వ్యాఖ్యాతను ఎంచుకోవాల్సిన

బిగ్‌బాస్: కమల్ స్థానంలో ఒక్కరు కాదు.. ముగ్గురు

విశ్వనటుడు కమల్‌హాసన్‌కు కరోనా వైరస్‌ సోకడంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన హోస్ట్‌గా ప్రసారమయ్యే రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 5 తమిళ కార్యక్రమానికి ఇపుడు తాత్కాలికంగా కొత్త వ్యాఖ్యాతను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కమల్‌హాసన్‌ స్థానంలో ఎవరు హోస్ట్‌గా ఉంటారన్న చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఈ రియాల్టీ షోకు హోస్ట్‌గా ఆయన పెద్ద కుమార్తె శృతిహాసన్‌తో పాటు హీరో సూర్య, సినీ నటి రమ్యకృష్ణ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీరిలో ఎవరు హోస్ట్‌గా వస్తారనేది ఇప్పటి వరకైతే బయటికి రాలేదు. కానీ ‘బిగ్‌బాస్’ నిర్వాహకులు ఈ ముగ్గురిని సంప్రదించినట్లుగా అయితే తెలుస్తోంది. హోస్ట్ చేసేందుకు శృతిహాసన్ ఇంట్రస్ట్ చూపించినట్లుగా టాక్ నడుస్తోంది.

Updated Date - 2021-11-24T23:38:01+05:30 IST