కమల్ హసన్ Vikram సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏ OTT లో రిలీజ్ కాబోతోందంటే..

ABN , First Publish Date - 2022-06-24T19:57:00+05:30 IST

దాదాపు నాలుగేళ్ల తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన చిత్రం ‘విక్రమ్’. ‘ఖైదీ’, ‘మాస్టర్’ చిత్రాలతో..

కమల్ హసన్ Vikram సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏ OTT లో రిలీజ్ కాబోతోందంటే..

దాదాపు నాలుగేళ్ల తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన చిత్రం ‘విక్రమ్’. ‘ఖైదీ’, ‘మాస్టర్’ చిత్రాలతో తమిళంతోపాటు తెలుగులోనూ గుర్తింపు పొందిన లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకి దర్శకుడు. జూన్ 3న విడుదలైన ఈ మూవీ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. చాలాకాలం తర్వాత కమల్ హాసన్‌ని సరైన హిట్‌ని ఇచ్చింది. పవర్-ప్యాక్డ్ కథాంశం, యాక్షన్ సన్నివేశాలతో కమల్‌ని బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన 20 రోజుల్లోనే రూ. 350 కోట్లకి పైగా కలెక్షన్స్‌ని సాధించింది. ముఖ్యంగా తమిళనాడు (Tamil Nadu)లో రూ.155 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ అన్ని రికార్డులనూ బద్దలు కొట్టింది. దాదాపు ఐదేళ్లుగా పదిలంగా ఉన్న బాహుబలి 2 సాధించిన రూ.152 కోట్ల కలెక్షన్లని దాటేసి నెంబర్ 1గా నిలిచింది. త్వరలోనే రూ.400 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు తీస్తోంది.


ఇంకా థియేట్రికల్ రన్ పూర్తి కాని విక్రమ్ గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అదే ఈ సినిమా OTT విడుదల గురించి. ఆ న్యూస్ ఆ కమల్ అభిమానులతోపాటు విక్రమ్ మూవీ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. నివేదికల ప్రకారం.. ఈ సినిమా వచ్చే నెల అంటే జూలై 8న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney plus Hotstar)లో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే.. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహాద్ పాజిల్ ముఖ్యపాత్రలు పోషించగా.. తమిళ హీరో సూర్య (Surya) ‘రోలెక్స్’ అనే పాత్రలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. కాగా.. ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మహేంద్రన్‌తో కలిసి కమల్ హాసన్ స్వయంగా నిర్మించారు.

Updated Date - 2022-06-24T19:57:00+05:30 IST