నాలుగు భాగాలుగా Bimbisara ?

ABN , First Publish Date - 2022-07-05T22:52:23+05:30 IST

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyanram).. చివరగా నటించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’ (Entha Manchivadavura). సతీశ్ వేగేశ్న (Sateesh Vegesna) తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు.

నాలుగు భాగాలుగా Bimbisara ?

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyanram).. చివరగా నటించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’ (Entha Manchivadavura). సతీశ్ వేగేశ్న (Sateesh Vegesna) తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు. ఫీల్ గుడ్ కథాంశంతో మెప్పించాలని ప్రయత్నించినప్పటికీ.. ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రాలేదు. ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా ‘బింబిసార’ (Bimbisara) అనే భారీ బడ్జెట్ చిత్రంతో ఒక సాహసమే చేస్తున్నాడని చెప్పాలి. తన మార్కెట్‌కు మంచి చిత్రాలు నిర్మించే కళ్యాణ్ రామ్ వశిష్ట్ (Vasist) అనే కొత్త దర్శకుడ్ని నమ్మి.. అతడి చేతికి ‘బింబిసార’ లాంటి భారీ బడ్జెట్ చిత్రం అప్పగించడం గమనార్హం. టైమ్ ట్రావెల్ కథాంశంతో నిర్మించిన ఈ సినిమాను ఆషా మాషీగా తీయలేదని నిన్న (సోమవారం) విడుదలైన ట్రైలర్ లోని విజువల్స్ చూస్తే అర్ధమవుతుంది. 


గ్రాఫిక్స్, సెట్టింగ్స్, డైలాగ్స్ యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఒక స్థాయి కనిపించింది. అయితే ‘అతనొక్కడే (Athanokkade), పటాస్ (Patas), 118’ చిత్రాల తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో హిట్స్ అందుకోలేకపోయిన కళ్యాణ్ రామ్ ఏ ధైర్యంతో బింబిసార లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడన్నది ప్రశ్న. అందులోనూ ఈ మధ్య థియేటర్స్ బిజినెస్ బాగా దెబ్బతింది. ప్రేక్షకులకు థియేటర్స్ కు వచ్చి సినిమాలు చూడ్డం తగ్గించేశారు. ఇలాంటి సమయంలో మార్కెట్ దెబ్బతిన్న కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ అలాంటి భారీ చిత్రంతో రానుండడమే ఆశ్చర్యమనుకుంటే.. దీన్నో ఫ్రాంచైసీలా మారుస్తామని, దీనికి కొనసాగింపుగా మరో మూడు చిత్రాలు రాబోతున్నాయని ప్రకటించడం విశేషం. 


‘బింబిసార 2’ (Bimbisara 2) కు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయని, వచ్చే ఏడాది ఆగస్ట్ 23న రెండో భాగం విడుదల కానుందని కళ్యాణ్ రామ్ ప్రకటించడం గమనార్హం. కుదిరితే తర్వాతి భాగాల్లో తన తమ్ముడు యన్టీఆర్ కూడా నటిస్తాడని కళ్యాణ్ రామ్ పేర్కొనడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించేదే. అయితే ముందుగా ఆగస్ట్ 5న మొదటి భాగం విడుదలవ్వాలి, ఆ సినిమా భారీ సక్సెస్ అందుకోవాలి. అప్పుడే సెకండ్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాతే 3,4 భాగాలు గురించి ఆలోచించాలి. మరి ‘బింబిసార’ మొదటి భాగం మిగిలిన భాగాలు తీయడానికి వీలు కల్పిస్తుందో లేదో చూడాలి. 


Updated Date - 2022-07-05T22:52:23+05:30 IST