Bimbisara : సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే.. !

ABN , First Publish Date - 2022-07-28T20:44:45+05:30 IST

నందమూరి కళ్యాణ్ రామ్ తాజా చిత్రం ‘బింబిసార’. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషియో పాంటసీ సినిమాను యన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామే స్వయంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కేథరిన్ ట్రెస్సా కథానాయికగా నటిస్తుండగా.. సంయుక్తమీనన్, వరీనా హుస్సేన్, ప్రకాశ్ రాజ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Bimbisara : సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే.. !

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyanram) తాజా చిత్రం ‘బింబిసార’ (Bimbisara). మల్లిడి వశిష్ట (Mallidi vasistha) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషియో పాంటసీ సినిమాను యన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామే స్వయంగా నిర్మించాడు. కేథరిన్ ట్రెస్సా (Catherine tressa) కథానాయికగా నటిస్తుండగా.. సంయుక్తమీనన్, వరీనా హుస్సేన్, ప్రకాశ్ రాజ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కీరవాణి (Keeravani) అందించగా... చిరంతన్ భట్ (Chiranthan Bhatt) సాంగ్స్ కంపోజ్ చేశాడు. ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు చిత్రానికి యూ / ఏ సర్టిఫికెట్ జారీచేశారు. చిత్రానికి 146 నిమిషాలు.. అంటే  2గంటల 26 నిమిషాల రన్ టైమ్ ను ఫిక్స్ చేసినట్టు మేకర్స్ అధికారికంగా తెలిపారు.  


క్రీ.పూ 5వ శతాబ్దంలోని త్రిగర్తల సామ్రాజ్యాధినేత ‘బింబిసార’ పరిపాలనా విధానము, నిరంకుశత్వం, అతడి బలము, బలగము ఏంటన్నది ఈ సినిమాతో చూపించబోతున్నారు. అయితే ఈ సినిమా ‘మగధీర’  (Magadheera) తరహాలో.. వర్తమానం సాంఘికంలోనూ, భూతకాలం చారిత్రక ఘట్టాలతోనే తెరకెక్కడం విశేషం. కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే.. విజువల్స్ కూడా చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. కొంతకాలంగా సరైన హిట్స్ లేని కళ్యాణరామ్ ‘బింబిసార’ చిత్రంపైనే పూర్తిగా ఆశలన్నీ పెట్టుకున్నాడు. కళ్యాణ్ రామ్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు, కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ మాయాజాలం ‘బింబిసార’ చిత్రానికి హైలైట్స్ కానున్నాయి. మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్‌కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి. 

Updated Date - 2022-07-28T20:44:45+05:30 IST